పుట:Kavijeevithamulu.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

315

గుహరిశ్చంద్రనళోపాఖ్యానమునకు ముందుగ పింగళిసూరనకృత రాఘవపాండవీయము రచియింపఁబడిన మాత్రముననే రామభూషణ కవి కంటె సూరనకవి ప్రాచీనుఁ డని చెప్ప వచ్చునా యని శంక జనింపఁ గలదు. అ ట్లని మాయభిప్రాయము కా దనియు, నీయిర్వురును సమకాలీనులని చెప్పుటకు పైయుక్తులే చాలుననియు, ప్రథమగ్రంథము రచియించినవాఁడే పూర్వుఁడు కావలయు నని చెప్పెడువారిమతముం బట్టి చూడ సూరనకవియే రామరాజభూషణునకుఁ బ్రాచీనుఁడు కావలయు ననియు న ట్లైన రామభూషణునికాలీనుఁ డగు నళియ రామరాజు కంటెంగూడ సూరన ప్రాచీనుఁడు కావలసి వచ్చు ననియును, అనఁగా నళియ రామరాజునకుఁ బ్రాచీఁను డగునతనిమామ యగుకృష్ణదేవరాయలును నళియ రామరాజు సంస్థానకవి యగురామరాజభూషణునికంటెఁ బ్రాచీనుఁడగుపింగళి సూరకవియును సమకాలీను లని సమాధానము చెప్పవలసి యున్నది.

గ్రంథాతరముం బట్టి నిర్ణయింపఁబడిన పింగళిసూరకవి కాలము.

ఇతని కాలనిర్ణ యమున కింకొకమార్గము కలదు. అది మిక్కిలి చిక్కైనమార్గమును, చాలశ్రమ పెట్టునదియు నై న్నది. అయిన నది సూరనకవివలననే చెప్పఁబడియున్నది కావున దాని నిచ్చో మనము వివరింపకతప్పదు.

కళాపూర్ణోదయకృతిపతి యగుకృష్ణమరాజుయొక్క వర్ణనముం జేయుచుఁ జెప్పంబడిన షష్ఠ్యంతపద్యములలో.

"క. విశ్రుత తిరుమల తాతా,ర్య శ్రేష్ఠాన్వయ సుదర్శనాచార్య తనూ
     జ శ్రీనివాస గురుచర, ణాశ్రయణ సమార్జి తాఖిలాభ్యుదయునకున్."

అని యి ట్లొకపద్యము వ్రాయఁబడినది. కాని యింతమాత్రము చేత మనకు కృష్ణమరాజుకాలముగాని అతని కాలీనుఁ డగు పింగళి సూరకవికాలముగాని నిర్ణయింపఁబడలేదు. అట్టికాలనిఋనయముఁ జేయుటకుఁ