పుట:Kavijeevithamulu.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

314

కవి జీవితములు

నియే మొట్ట మొదటినుండియు కవులయభిప్రాయము. అట్లు కాని నాఁడు రామకృష్ణోపాఖ్యాన మనుద్వ్యర్థి కావ్యమునందు శ్రీపాద వేంకటాచలకవి.

"ఉ. సూరకవీంద్రుఁ డేర్పఱచుచొ ప్పొకయించుక గాంచి నెమ్మదిన్
      గూరిమి రామకృష్ణుల గనుంగొనఁగోరి తదీయసత్కథా
      సారము జోడు చేసి యొకసత్కృతిఁ గూర్పగ సాహసించితిన్
      ధీరవరేణ్యులార యిది తెల్లముగా దయ నాదరింపుఁడీ.

ఉ. వెంగలు లెందఱో కడు వివేకము లేకను దామె యర్థపుం
    భంగులు రెండుమూఁడు గలభవ్యకవిత్వముచేఁ బ్రబంధముల్
    రంగుగఁ గూర్చినా మనుచు రాజస మొప్పఁగ నుందు రందుకై
    పింగళిసూరనాహ్వయుఁడు బెట్టినమార్గముగాక కల్గునే."

అని యివ్విధముగ నేల యుదాహరించి యుండును? మఱియు గణపవరపు వేంకటకవి ప్రబంధ రాజ వెంక టేశ్వరవిలాసమునందు.

"సీ. అల విన్నకోట పెద్దన లక్షణజ్ఞిత, శబ్దశాసనకవి శబ్దశుద్ధి
      ప్రాబంధికపరమేశ్వరు నర్థమహిమం బు, భయకవిమిత్త్రుని పదలలితము
      శ్రీనాథు వార్తాప్రసిద్ధి నాచనసోము, భూరికాఠిన్యంబు పోతరాజు
      యమకవిధము మల్లయమనీషి చిత్రంబు, పింగళిసూరకవివరు శ్లేష."

అనియును వ్రాసియుండెఁ గాన రాఘవపాండవీయమును వ్రాసినతరువాత రామరాజభూషణకవి హరిశ్చంద్రనలో పాఖ్యానము వ్రాసియే యుండును. పైపీఠికలోపలనే శ్లేషకవుల సూ రకవి మొదటను రామరాజభూషణకవి యనంతరమందు నుదాహరించఁబడిన (నైషధ పారిజాతీయము) అనుకృష్ణాధ్వరికృత ద్వ్యర్థికావ్యములోని యొకపద్య ముదాహరింపఁబడినది.

ఉ. ప్రేషము లేమియుం గనమిఁ బింగళిసూరప రామరాజస
    ద్భూషణభాషితంబు లగుపుణ్యకథాద్వయసంగ్రహాద్భుత
    శ్లేష కృతు ల్బ్రసిద్ధిఁ గని శ్రీరఘునాథనృపాలమౌళి నా
    నైషధపారిజాతకృతినాయకరత్నముఁ జెంది హెచ్చగున్.

కృష్ణరాయలయల్లుం డగునళియరామరాజు కాలీనుఁ డై అతనిపై ననేకగ్రంథములు రచియించిన రామరాజ భూషణకవి రచిత మ