పుట:Kavijeevithamulu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

కవి జీవితములు



మార్గములోఁ [1] దెనుఁగురాయఁడు గట్టించినచెఱువునీ ళ్లన్నియు నాలుగుగడియలకు నింకిపోవునటులఁ దిట్టెను. ఎట్లన్నను :-

క. బడబానలభట్టారకు, కుడిచేయుంగరము రవికి గొబ్బున నర్ఘ్యం
   బిడువేళ నూడి నీలోఁ, బడియెఁ దటాకంబ నీటిఁ బాయుమ వేగన్.

ఈబడబానలభట్టు శాలివాహన సం. 1019 న వెలమవంశస్థులగోత్రఖండచేసెననియు నద్దానింబట్టి యీకవి వారిచే నెల్లపుడు స్మరియింపఁబడవలసిన వాఁడుగాఁ బద్మనాయకచరిత్ర మనువెలమల వృత్తాంతగ్రంథములో వ్రాయఁబడి యున్నది. ఆచరిత్రము వ్రాయుచో నీకవివృత్తాంతంబు వ్రాయుదము. అప్పటికి బడబానలభట్టు మిక్కిలి వృద్ధుగా నుండి యుండును కాఁబట్టి బడబానలభట్టును శాలివాహన సం. 950 సమీపకాలమునఁ బుట్టి యుండ నోవును. ఇది భీమకవికాలమే అగును.

చొక్క రాజుతో యుద్ధమునకు వచ్చినసాహిణిమారునిఁ దదాస్థానమందుండెడుభీమకవి తిట్టి పద్యముఁ జెప్పె ననుటంజేసి యీమువ్వురును సమకాలీనులని వేఱే చెప్పవలసినది లేదు. భీమకవియొక్క కాలనిర్ణయమునకై పైని మనము చేసినచర్చయే తగి యున్నది. కాని కొంద ఱాధునికచారిత్రకులు వాక్రుచ్చినవిధముగా నితఁడు పదుమూఁడవశతాబ్దారంభమున నున్నట్లూహింప వీలు లేదు. చొక్కరాజు శాలివాహనశకము పదుమూఁడవశతాబ్దమువాఁ డైనట్లుగా వ్రాఁతమూలములు లేవు. ఇతని కాలమునకే సాహిణిమారుఁడు నున్నట్లు కాన్పించును. అతనింబట్టి భీమన కాలముగాని చొక్కరాజుకాలము గాని నిశ్చయింప వీలు పడునా ? గుడిమెట్టపోతరాజు భీమకవిగుఱ్ఱమును దొంగిలించె నని యున్న యొక వదంతినిబట్టి భీమకవికాలమును నిర్ణయింప వీలు లేదు. ఆకథ రెల్లూరి తిరుమలయ్య శ్రీపతిరాజు నుద్దేశించి చెప్పినట్లుగా నప్పకవి చెప్పియున్నాఁడు. ఈ ప్రాంతములయందు లేటవరపుపోతరాజుంగూర్చి తురగారామకవి చెప్పె నని వాడుక గలదు. ఇట్టిభేదములతో నొప్పుచుండెడి యీవృత్తాంతమునుబట్టి భీమకవియొక్క కాలము మనము నిర్ణయించుట కేమి

  1. ఇతని పేరే భీమకవి "వెలుంగాధీశ" అని చెప్పినట్లు తోఁచెడిని.