పుట:Kavijeevithamulu.pdf/319

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
313
పింగళిసూరన.

ఆయిర్వురలో సూరన పెద్దనకంటెఁ జిన్నయును రామభూషణునికంటె బెద్దయు నై యుండుట సరిపడును.

ఈ సంవాదమునే మరియొక గ్రంథోదహరణముచేత బలపఱచెదను :-

హరిశ్చంద్రనలోపాఖ్యాన కవి యగురామభూషణునిచారిత్రము గ్రంథపీఠికలో బ్ర. పూండ్ల. రామకృష్ణయ్య పంతుల వలన కొంతకొంత వ్రాయఁబడినది. అం దా రామభూషణకవిరచిత మగుద్వ్యర్థికావ్యము ప్రథమమైనదా లేక పింగళసూరన కృతద్య్వర్థికావ్య మగురాఘవపాండవీయము ప్రథమ మైనదా యనుసంప్రశ్నమునకు నప్రమాణముగ నుత్తరమీయఁబడినది కావున నే నిపు డాపంక్తులనే బొందుఁజొందు పఱిచి ప్రామాణిక పండితాభిప్రాయము సూరనకవిగ్రంథమే ప్రథమమైనదని గాని రామరాజకృతగ్రంథము ప్రథ మైనది కా దనియు, రామరాజభూషణునికంటె సూరనకవియే పూర్వుఁ డనియుం జెప్పెదను.

హరిశ్చంద్రనలోపాఖ్యానముపీఠిక, పుట 12లో ఈద్వ్యర్థి కావ్యములలోఁ బ్రథమకావ్యము పింగళిసూరకవికృతము మగురాఘవపాండవీయము గ నున్నను వేములవాడ భీమకవి యంతకుముందే మఱియొక రాఘవపాండవీయమును రచియించినట్లు నందే వ్రాయంబడియున్నది. ఇఁక మనమెఁఱిగిన శ్లేష కావ్యములలోఁ బ్రథమకావ్యము పింగళిసూరన రాఘవపాండవీయము. అది వ్రాయఁబడినతరువాత నీహరిశ్చంద్రనలోపాఖ్యానమును రామభూషణకవి రచియించెను. అట్లు కానిచో రాఘవపాండవీయములో "భీమన తొల్లిచెప్పె నని" అనుపద్యము వ్రాయఁబడి యుండదు గదా. పింగళసూరనకవియును రామభూషణకవియు శ్రీకృష్ణరాయ సంస్థానకవు లని కొందఱుపండితులయభిప్రాయము గావున రామభూషణకవి యీగ్రంథమును రచియించియున్న యెడల సూరన కది తెలియకపోవునా ! తెలిసిన సూరనగ్రంథమునం దట్లు వ్రాయునా? అఖండశ్లేష కావ్యమును బ్రథమమున వ్రాసినవాఁడు పింగళిసూరన య