ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పింగళిసూరన.
311
| ని నిశ్చయింపఁజాలను. సూరనకవి బాలుఁ డవుటంజేసి కృష్ణరాయలకుఁ గృతి నీయక పోవచ్చును. కృష్ణ రాయనియనంతరము తత్సంస్థానకవు లితరసంస్థానములు జేరి తమ తమ వార్ధక్యదశలో వారిపేరిటఁ గృతుల నిచ్చి యుండవచ్చును. కావున నీకట్టుకథ సూరకవికాలీనుఁ డని చెప్పుటకుఁ జాలియుండదు. | ||
| (13) కళాపూర్ణోదయమును రచియింపక పూర్వము సూరకవియాకువీటి రాజులవద్ద మొదట నుండి రాఘవపాండవీయముం జేసి వారి కంకితము చేయుటచే రాఘవపాండవీయము 1550 - 77 (శా. స. 1473) సంవత్సర ప్రాంతమందు మంచి పడుచుతనములో రచియించి యుండును. | (13) సూరకవి యాకువీటిరాజులవద్ద మొదట కాఁపుర మున్నందులకుఁగాని, రాఘవపాండవీయము క్రీ. శ. 1550 సంవత్సర ప్రాంత మందుఁ జేసి యున్నందులకుఁగాని అప్పటికి సూరకవి మంచిపడుచుఁ దనములో నున్నందులకుఁ గాని గ్రంథదృష్టాంతములు లేవుగావున నిది సిద్ధాంత మని నిశ్చయింప వీలుపడదు. |
సూరకవి కాలనిర్ణయము.
ఇంతవఱకును జెప్పఁబడిన పూర్వపక్షములంబట్టి సూరనకాల మింకను స్థిరపడలేదు. ఇఁక దానిని స్థిరపఱుచుటకు నొకటి రెండు గాథలు క్రొత్తవి వక్కాణించెదను. వానిని పైపూర్వపక్షములతోఁ గల్పి యోఁచించినయెడల సూరనకాలము యొక్క పరిజ్ఞానము కొంచెము కల్గును. అందు మొదటిది సూరనకృత మగురాఘవపాండవీయము మొదటిదా ? లేక వసుచరిత్రకారుఁ డగురామరాజభూషణకవికృతమగుహరిశ్చంద్ర నలో పాఖ్యానము మొదటిదా ? అను సంప్రశ్న మై యున్నది. రాఘవపాండవీయము కృతినందునపు డందలికృతిపతి సూరకవితో నీక్రింది వాక్యంబులు పల్కిన ట్లాగ్రంథములోఁ గాన్పించును.