పుట:Kavijeevithamulu.pdf/310

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
304
కవి జీవితములు

నిర్ణయము నిలువదు. [1] చారిత్రములో రాజులయొక్క అధికారకాలము నిర్ణయించవలసి వచ్చినప్పుడు దామాషాగా నంగీకరింపఁబడిన సంవత్సరములు 15 (పదునేను) అని హూణచరిత్రకారులందఱి యొక్కయు మతమైయున్నదిగాని అది 20 (యిరువది) కాదు. అట్లు పదేను సంవత్సరముల లెక్కను బుక్కరాజు తరువాత రాజ్యము చేసిననల్గురు రాజులకు నఱువది (60) సంవత్సరము లైనది. క్రీ. శ. 1369 సంవత్సరమునకు పై సంఖ్య కలుపఁగా క్రీ. శ. 1429 లేక 1430 (శా. స. 1353) అయినది. ఇది నంద్యాలప్రభుం డగుకృష్ణమరాజు రాజ్యారంభసమయము కావలయును. ఇది ఆంధ్రకవిచరిత్రములో వ్రాయంబడిన కాలమునకు నూటముప్పది సంవత్సరములు పూర్వమై కాన్పించుచున్నది. కాఁబట్టి దీనిం బట్టి నంద్యాల కృష్ణరాయల కాలముగాని అతని కాలీనుఁ డగుపింగళ సూరకవి కాలముగాని నిశ్చయింప వీలుపడలేదు.

(3) ఈకృష్ణరాజు విజయనగరమును సదాశివరాయలు పాలించు చుండిన కాలములో నంద్యాలరాజైనట్లు కానఁబడుచున్నది. (3) ఈ కారణముచేత సూరకవి అతనికిఁ బూర్వుఁ డైనయచ్యుతదేవరాయల కాలములోఁ గాని అచ్యుత దేవరాయలతో సమాన కాలములో వ్యవహరించిన కృష్ణరాయల కాలములోఁ గాని లేఁడని చెప్ప వీలుపడదు గదా. స్యూయలుదొరలీష్టులప్రకారము క్రీ. శ. 1528 వత్సరము మొదలువిజయనగరములో నీయఁబడిన శాసనములను బట్టి కృష్ణరాయలు, అచ్యుతరాయలు నుభయులుగూడ విజయనగరసంస్థానాధిపతులు గా నున్నట్లు కానుపించును.
  1. ఈకవిచరిత్రము లోపలనే కృష్ణరాయల చరిత్రము వ్రాయుచొ నీబుక్కరాజు కాలము నేను పైన వ్రాసిన విధముగ నే యున్నది. కాని సూరకవి చరిత్రములో మాత్రము దానికి మఱియొకపాఠాంతరము కాన్పించును. దీనికిఁ గారణ మూహింపలేను.