పుట:Kavijeevithamulu.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

297

పరిచర్య చేసెదననియు, తన కొకవ్రత మున్నదిగావున ఆవ్రతము జరిపినచో జీతబత్తెము లక్కఱ లేకయే సేవచేసెద ననుడు బ్రాహ్మణుఁడు లెస్స యని దానివ్రతముం దెల్పు మనియెనఁట. అపు డాపేకి తనకు విరామము లేకుండ సర్వకాలమును పనులు చెప్పుచుండుప్రభుని గాని అన్యులఁ దాఁ గొలువ ననునదియే తనవ్రత మని తెల్పె. దాని కాబ్రాహ్మణుఁ డెంతయు సంతసించి చెప్పినపనులు చేయలేనిపరిచారకు లే దొరకుచుందురుగాని యిట్లు పనిచెప్పకున్న నుండ ననుచాకిరులు కుదరరు. పని చెప్పుట సులభమే చేయుటయే కష్టము. అని విచారించి "చెప్పినపని చేయ లేకున్ననో" అని సంప్రశ్నము చేసెను. "ఎడతెగకుండ పనిచెప్ప లేకున్ననో" అని పేకి తిరుగ ప్రశ్న చేసెను. దానికి బ్రాహ్మణుఁడు నవ్వి యోడిపోయినవారికి తగినట్లుగా నాలోచించవచ్చు ననియె. అందులకు పేకి సమ్మతించి ఆబ్రాహ్మణునికడ పరిచారికగాఁ గుదిరెనఁట ఆ నిముసము మొద లాబ్రాహ్మణుఁడు పనులు చెప్పుటకుఁ బ్రారంభించి త్వరలో వంటచేసి వడ్డించి యింటిపను లన్నియుఁ జేయు మనుడుఁ బేకియు నట్లే యని అతిశీఘ్రముగఁ గార్యముల నన్నిటిం జేసి మఱియేమిపని చెప్పెద వని యడిగెను. అప్పటికిం జేయవలసినపను లేమియుఁ జేయునవి లేక బ్రాహ్మణుఁడు ఆలోచించుచుండ నాతనిభార్య నవ్వి మాదొడ్డిలో రెండుభావు లున్నవి. అందులో నీరంతయుఁ దోఁడి తెల్లవాఱునంతలో మాపొలములన్నియుఁ దడిపి రమ్మని చెప్పిపంపెను. పేకియు నటులనే తెల్లవాఱులోపలఁ బొలమంతట మళ్లు కట్టి నూతులలో నుండు నీరంతయు రెండు మోటగూనలతోఁ దోఁడి ఆమళ్లు తడిపి సూర్యోదయ సమయమునకుఁ దిరిగి తనప్రభుని దర్శించి యేమిపని చెప్పెద వని సం ప్రశ్నించెను. దానిం జూచినతోడనే ఆబ్రాహ్మణుఁడు భయాక్రాంతుఁడై నిత్యకృత్యములు చేయు మని చెప్పి భోజనాదికము లైనపిమ్మట మఱియేదియో యొకపని కల్పించి పేకిని పంపి తానును తనభార్యయును రాత్రివేళ నొకనిర్జనస్థలంబున కుం బోయి విడిసియుండిరి. పేకి తనకుఁ