పుట:Kavijeevithamulu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

కవిజీవితములు.

ఆంధ్రద్వ్యర్థికావ్యకవులచరిత్రము.

14.

పింగళి సూరన

ఇతడు ద్వ్యర్థికావ్యకర్తలలో మొదటివాడు. ఈతనికి ముందు ద్వ్యర్థికావ్యరచనకై వెములవాడ, భీమకవి యత్నించె ననిమాత్రము తెలియవచ్చునుగాని ఆగ్రంథము కొనసాగినట్లు తెలియదు. ఉన్నను అది యెచ్చటను దొరకుటయును లేదు. ఈసూరన కావ్యములలో బ్రథమమైనది రాఘవపాండవీయ మనుద్వ్యర్థికావ్యము. ఇది పుట్టినకొన్ని దినములకే భట్టు రామరాజభూషణునివలన హరిశ్చంద్రనలోపాఖ్యానమును మఱియొక ద్వ్యర్థికావ్య ముద్భవించినది. ఈరెండుగ్రంథము లైన పిమ్మట మఱికొందఱు కవు లాంధ్రమున ద్వ్యర్థికావ్యములు రచియించుటకు యత్నించినారు. మూడర్థములు వచ్చునట్లుగా గూడ కొందఱాంధ్రకావ్యములం జేసియున్నారు. కాని వాని కన్నింటికి నీపైరెండు గ్రంథములకు వచ్చిన వ్యాపకము గాని ప్రతిష్ఠ గాని వచ్చియుండ లేదు. ఆధునిక కవులలో బిండిప్రోలు లక్ష్మణకవీ యనునొక యాంధ్రకవి లంకావిజయ మనునామాంతరము గల "రావణదమ్మీయము" అనునొక ద్వ్యర్థికావ్యమును రచియించినాడు. ఇతడును తన సమకాలీనులలో విశేషవిఖ్యాతి గాంచినవా డౌటంబట్టియు, గ్రంథ మతిప్రాగల్భ్య