పుట:Kavijeevithamulu.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

287

గుత్తకీయంబడినట్లుగా నీవఱ కెక్కడును దృష్టాంతములుకాన్పించ లేదు. శ్రీనాథునకుఁ గాశీఖండరచననాఁటికే ముదుసలితనము వచ్చియుండును. అట్టిచో నంతవయస్సు చెల్లినపిమ్మట గ్రామములు గుత్తకుఁ దీసియుండుటయు, సంశయింపవలసినయంశమే యయి యుండును. ఇఁక మూఁడవయంశములోఁ జెప్పంబడిన నల్లగుం డెత్తించుటయును, సంకెలలు వేయించుటయు మఱియు నసందర్భములుగాఁ గాన్పించుచున్నవి. పూర్వకాలములో వ్యవసాయదారులు పన్నియ్య లేనిచోఁ గొందఱు క్రూరు లగుగ్రామయజమానులవలన నిట్టిదండనలు సామాన్యక్షుద్రప్రజలవిషయమై చేయంబడి యున్నట్లు వినుచున్నాము గాని శ్రీనాథునివంటి కవివరునకు గ్రామమును గుత్తకుఁగొని యున్న వానికిఁగూఁడ నిట్టిశిక్ష గ్రామయజమానివలనఁ గాక రాజువలననే చేయంబడియుండె ననుమాట మఱియు నసందర్భముగా గాన్పించు. కవుల కుపకారము చేయుతలంపునఁ బ్రభువులు గ్రామములు బహుమానముగాఁ గాని గుత్తగాఁ గాని యిచ్చియున్నను వానిపైఁ దమ కుండుస్వాతంత్ర్యమును వదలకున్న నుండెదరుగాని యందుకుఁగా నొకపన్నేర్పర్చుటయు నది యియ్యనినాఁడు వారింగూడ నితరులవలె దండించుటయు నిపుడు మనము వ్రాయుచున్న శ్రీనాథునికాలము జరిగియుండు ననుట కేవల మసందర్భము. ఆకాలము కవు లలిగినఁ దిట్టిచంపుదు రనుభయము విశేషముగాఁ గలిగి యుండెను. ఒకవేళ శ్రీనాథుఁడు సొమ్మియ్యలేకున్న నేదియేని గ్రంథ మొకదానిని రచించి యా రాజునకో లేక తత్సమీపవాసస్థు లగు మఱియొకరికో కృతి యిచ్చి సొమ్ము తెచ్చి యిచ్చి వైచునుగాని యందులకుఁగాను నిగళబద్ధుఁడై యాసంగతి గ్రంథస్థము చేసియుండుట తటస్థింపదు. కాఁబట్టి యీపద్యములోనిసంగతులు యథార్థము లని చెప్పుట సరికాదు.

ఇఁక రెండవపద్యములో శ్రీనాథుఁడు దివి కేఁగుట వ్రాయంబడినది. అదియు నసందర్భముగానే కాన్పించుచున్నది. ఈశ్రీనాథుఁడు