పుట:Kavijeevithamulu.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

కవి జీవితములు

గీ. కృష్ణవేణమ్మ కొనిపోయె నింతఫలము, బిలబిలాక్షులు తినిపోయెఁ దిలలు పెసలు
    బొడ్డుపల్లెను గొడ్డేఱి మోసపోతి, నెట్లు చెల్లింతుఁ డంకంబు లేడునూర్లు.

సీ. కాశికావిశ్వేశుఁ గలిసెవీరారెడ్డి, రత్నాంబరంబు లేరాయ డిచ్చుఁ
    కైలాసగిరిఁ బండె మైలారువిభు డేఁగి, దినవెచ్చ మేరాజు తీర్పఁగలఁడు
    రంభఁ గూడెఁ దెనుంగురాయరాహుత్తుండు, కస్తురి కేరాజుఁ బ్రస్తుతింతు
    స్వర్గస్థుఁ డయ్యె నిస్సనమంత్రి మఱి హేమ, పాత్రాన్న మెవ్వని పం'క్తిగలదు.

గీ. భాస్కరుఁడు మున్నె దేవునిపాలి కరిగెఁ, గలియుగంబున నిఁక నుండఁగష్టమనుచు
    దివిజకవివరుగుండియల్ దిగ్గురనఁగ, నరుగుచున్నాఁడు శ్రీనాథుఁ డమరపురికి.

ఇట్లున్న పై సీసపద్యములు రెండును శ్రీనాథకృతము లగునాయని యొకశంక పొడముచున్నది. దీనికి గ్రంథదృష్టాంతములు కాన రావు. శ్రీనాథకృత గ్రంథములలో నివి యుండు నని చెప్పుట యసందర్భమే. అటు గాకున్న శ్రీనాథునిపద్యములుగా నితరలాక్షణికులచే నుదాహరింపఁబడియు నుండలేదు. పద్యములు చదివినతోడనే యివి శ్రీనాథ కృతములు కావేమో అను నొకశంక పొడముచున్నది. దానికి మొదటి కారణము శ్రీనాథుఁడు తనచివరకాలములోఁ గృష్ణాతీరమునందుండునట్లు చెప్పుట. రెండవదియప్పటిరాజుదగ్గఱ నొకగ్రామము గుత్తకుఁగొనుట, మూఁడవది యాగుత్త సొమ్మియ్యలేకున్న నతనికాలికి సంకెలల వేయంబడెననియు, వీఁపుపైని నల్లని యొకఱాతిగుం డెత్తింపఁబడె ననియు నుండుట. పైవానిలో మొదటిది యగుచివరకాలములోఁ గృష్ణాతీరమున శ్రీనాథుఁ డున్నాఁ డని చెప్పుమాటకు సహకారము లగుగాథలు లేవు. దీనికి వ్యతిరేకముగా శ్రీనాథునిబాల్యవయసు మొదలు రాజమహేంద్రవరప్రభు లగురెడ్లకును వారిమంత్రులకును గృతుల నిచ్చుచుండుటయే ఆతనిముసలితనములోఁ గృష్ణాతీరమున వసియించి యుండె ననుమాటను బూర్వపక్షము చేయుచున్నది.

రెండవయంశ మగుకృష్ణాతీరములోనిరాజుకడ నతఁడు బొడ్డుపల్లె యనుగ్రామము గుత్తకుఁ గొనె ననునది. పూర్వకాలము కవులకు ననేకగ్రామములు శాశ్వతముగాఁ గాకున్న జీవితకాల మనుభవించుటకైన నియ్యంబడునాచారంబు కాన్పించుచున్నది కాని పైవిధమున