పుట:Kavijeevithamulu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేములవాడ భీమకవి

17

అని యనంతర మాంధ్రభాషావాగనుశాసనుం డనంబరఁగిన నన్నయభట్టారకుం గొనియాడెను. అనంతరము తొంటివరుస చెడనట్లుగాఁ దిక్కనసోమయాజిని నెఱ్ఱప్రగ్గడంగూడ వర్ణించి చెప్పెను. ఇప్పద్యముం బట్టిచూడఁగా భీమకవి నన్నయభట్టునకును బూర్వుం డని నిర్ణయింపఁబడినది యగుచున్నది. మన మిదివఱకు వాక్రుచ్చిసచారిత్రను నట్లే స్థిరపఱుచుచున్నది. కావున నిఁక నీవిషయమై నంవాదముతో నవసరము లేదు. మైలమభీముని అమరావతి శాసనమువలన నితనిసమకాలీనుఁ డగునా రాజు శాలివాహన సం. 925 లో నున్నట్లు కాన్పింపఁగా భీమకవి ఆసమీపకాలములో నున్నవాఁ డని చెప్ప నొప్పియుండును. అయినను "వెలుంగాధీశ" యనుపదము విమలాదిత్యునకు వర్తింపకపోవుననిశంకించి యీకథ యింతటితో నిలిపి మఱియొకకథంబట్టి భీమకవికాలమును నిర్ణయింతము. అది రాజకళింగగంగు కాలమునుఁ బట్టి దానింగూర్చి మన మిపుడు నంవాదించి నిర్ధారణ చేయవలసి యున్నది. దీనివిషయమై మనము వ్రాయుటకుఁబూర్వము భీమకవి చేసినకళింగపట్టణముయొక్క వర్ణన నిచ్చోటున వివరింతము. అదెట్లనిన :-

సీ. యోజనద్వయవిశాలోన్నతిఁ జెలువొంది, పట్టణం బమరు శోభావిభూతి
   హాటకరత్న కవాటానుమోదమై, సూటి మించును గంచుకోటమహిమ
   నూటొక్కగుళ్ల చెన్నుగ శివానందమై, నిత్యోత్సవక్రీడ నెమ్మిఁ దనరు
   వంశధా రానదీవా రాశిసంయుత, సాగరసంగవిస్రంభ మమగఁ

గీ. గడిఁది రాజకళింగభూకాంతునకును, దనరునవలక్ష కాళింగ మనఁగ నొప్పి
   శృంఖళద్వీప మనఁగఁ బ్రసిద్ధి మించు, గణనకెక్కుఁ గళింగపట్టణము ధాత్రి.

దీనింబట్టి చూడ శృంఖళరాజనామము రాజకళింగగంగునకుఁ బర్యాయపద మైనట్లుగా సూచించుచున్నది. శృంఖళద్వీప మని ప్రసిద్ధిఁ జెందినకళింగ పట్టణమున కధిపతి గావున నాతని నొకపరి శృంఖళుఁ డనియుఁ గళింగాధిపుఁ డనియు వాడుచు వచ్చెను. ఇతఁడు చాళుక్యశాఖలోనిభాగ మగుగంగవంశపు రాజులలోనివాఁడు గనుక నితనిని గళింగగంగని వాడినట్లుగాఁ గాన్పించును. ఉత్కళదేశపురాజవంశమునకు గాంగేయవంశ మనియు గంగవంశ మనియు గంగేశ్వరుఁ డనుపురుషునిఁబట్టి