Jump to content

పుట:Kavijeevithamulu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

276

కవి జీవితములు

జెప్పినకొండవీటి రెడ్లలోనన్న వేమనకు నల్లాడరెడ్డి కొడుకున కల్లుఁ డవుటంజేసి యనవేమారెడ్డిక్రిందఁ గలపాకలనాటి భాగమునకుఁగూడ నల్లాడరెడ్డి యధికారి యయి యుండును. ఆభాగమునకు రాచవేమన యధికారి యయ్యె, రాజమహేంద్రవరముగూడ రాచవేమనకు వచ్చిన విధము రెడ్లచరిత్రలో వివరింపబడును.

బెండపూఁడి అన్న మంత్రి వంశము.

శ్రీనాథుఁడు వేమారెడ్డివంశమును వర్ణించి యనంతరము భీమఖండముఁ గృతినందిన యన్న మంత్రి వంశముంగూర్చి కొంత వ్రాసెను. అట్టివంశవిస్తార మంతయు "ప్రసిద్ధమంత్రి చరిత్రము" అనునాదేశ చారిత్రములో వ్రాయంబడెం గావున నిపు డందలివివరముం దెలుపక యన్న మంత్రివంశస్థులలోనివా రేయేప్రభువుల కాలములో నుండిరో దానిమాత్ర మిచ్చటఁ జూపెదను.