పుట:Kavijeevithamulu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

275

న నొప్పియున్న దనియును, కమ్మశాఖ పంటలు (రెడ్లు) మొద లగుబహువిధశాఖలతోఁ బ్రకాశించె ననియుం దేలినది పాక నాటిదేశములో సింహవిక్రమ నగరము, దువ్వూరు, గండవరాళి అనుపట్టణము లుండె ననియు వానిని, (1) ప్రోలయ వేమన. (2) అన్న పోతరెడ్డి. (3) అన వేమారెడ్డి. (4) కుమారగిరిరెడ్డి మొదలగువారు పాలించి రనియును, అట్టివారితో సంబంధ బాంధవ్యముం గల యల్లాడరెడ్డి రాజమహేంద్రవరము నిజరాజధానిగాఁ జేసెనని దానికి సింహాచలపర్యంతము గలభూమికి లక్షకళింగ మని నామమున్నట్లు నున్నది. దీనింబట్టి చూడ శ్రీనాథుఁడు పాక నాటిలో నున్న యనవేమారెడ్డిసభలోనివాఁడై యుండిపైయనవేమారెడ్డిసంస్థాన మల్లాడరెడ్డివశము కాగాఁ దత్సంస్థానము నాక్రమించిన యల్లాడరెడ్డి నాశ్రయింపక యుండ నాతం డితనికి నన్న వేమారెడ్డి యిచ్చిన గ్రామములు రెండును హరియించి తనకూఁతున కిచ్చినట్లును, అది కారణముగ శ్రీనాథుఁ డితరసంస్థానములకుం బోయి కాలక్షేపము చేసినట్లును, నితరులం గృతిపతులం జేసినట్లును కాన్పించు. పైయల్లాడ రెడ్డికుమారుఁ డీ రాచవేమారెడ్డి. అతఁడు రాజమహేంద్రవఱమునకు వచ్చి యా రాజ్యము తనతమ్ముం డగువీరభద్రారెడ్డికిచ్చి యతనిగుండ వ్యవహారములంజరిపించు చుండినట్లు పైవచనముయొక్క తరువాయి నున్న పద్యమువలనం గాన్పించు. అట్టివేమవీరభద్రారెడ్లను సంతసింపఁ జేయుట కీభీమఖండములో శ్రీనాథుఁడప్రస్తుతముగనయిన రెడ్డివంశోత్కర్షయుఁ దన్మూలముగ రాచవేమనవంశావళియును జెప్పె. ఇట్టిగ్రంథము వినినయెన్ని నాళ్లకు శ్రీనాథుఁడు కాశీఖండముఁ జేయంగోరఁబడెనో యది తెలియదుగాని ప్రౌఢనిర్భరవయః పరిపాకమున నీ భీమఖండము చెప్పినందునను.

"ప్రాయ మింతకు మిగులఁ గైవ్రాలకుండఁ, గాశికాఖండ మనుమహా గ్రంథమేను దెనుఁగు చేసెద"

నని చెప్పుటంబట్టి చూడ నీరెండుగ్రంథములు నిరువదివత్సరముల వ్యవధిలోఁ బుట్టి యుండవచ్చునని తోఁచునుగాని శృంగారనైషధముమాత్రము నీండైన వయఃకాలములోఁ జెప్పఁబడియున్నది. అందులోఁగూడ నీవేమారెడ్డియే నుడువంబడెం గావున నాతనిరాజ్యము ముప్పదినలువది సంవత్సరములు పొడుగుగలదిగాఁ గాన్పించును. పైని