పుట:Kavijeevithamulu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

కవి జీవితములు

ది. వేమభూమిపాలుని వంశానువర్ణనమున మనదేశచారిత్ర కుపయోగింపఁదగినశూద్రులలోఁ గలశాఖాభేదంబులు వివరించి చెప్పెను. ఆభాగముమాత్ర మిచ్చో వివరించెదను. అది యెట్లన్నను :-

"ఉ. కైటభదైత్యవై రిపదకంజమునం దుదయంబు నంది మి
      న్నేటికి భూతధాత్రికిని నెంతయు నచ్చినతోడబుట్టువై
      హాటకగర్భముఖ్యనిఖిలామరమౌళిమహామణిప్రభా
      పాటలవర్ణ మైనయొకపావనవర్ణ ముదీర్ణ సంపదన్.

వ. ఆపుణ్యవంశంబు కంసాసురధ్వంసిచరణపల్లవంబు తనకుఁ బుట్టినిల్లు గావున, గారణ సంక్రమణంబునుంబోలెఁ జామర, తోమర, ఛత్ర, ధనుః,ఖడ్గాదిచిహ్నోపశోభితంబై, చెదలేటినీటివలనిసోదరీయస్నేహలబ్ధంబు లచ్చో నిపాతనత్వ, శుచిత్వ, గాంభీర్య, మాధుర్యంబులు భరితమనః, స్వభావ, వచనంబులు ధరియించి సైదోడుం బొదమి విశ్వవిశ్వంభరాక్రీడనంబునకు విదిర్చినపరమక్షాంతి యంతరంగంబున సంతరించి నిఖిలప్రపంచంబునకు నాధారంబై ప్రవర్తిల్లె. అందుఁ, 1. బద్మనాయకు లన, 2. వెలమ లన, 3. కమ్మ లన, నదినల్లనంబంట లన బహుప్రకారశాఖోప శాఖాభిన్నంబు లైనమార్గంబులం ద్రిమార్గగంగాప్రవాహంబునుంబోలె గోత్రంబు లెన్నెన్నియు జగత్పవిత్రంబులై ప్రవహించుచుండు. కల్పంబు లతిక్రమించి, మన్వంతరంబులు జరిగి, యుగంబులు సరిగడచి, వత్సరంబులు చని కాలచక్రంబు లతిక్రమించుచుండఁ జతుర్థమౌళిమండనంబై కీర్తివిహార ఘంటాపథంబై నపంటదసటి మహాన్వయంబున. పాకనాటిదేశంబున భద్రపీఠంబున నధివసించి, సింహవిక్రమనగర, దువ్వూరు, గండవరాళిపట్టణంబులు నిజనివాసంబులు గా, భవాల తాష్టాదశద్వీపాంతరాళు లగుభూపాలగ్రామణులను, త్రిలింగభూమండలాఖండలులను, ప్రోలయవేమ, అన్నపోత, అన్నవేమ, కుమారగిరీశ్వరాదులన్ బూర్వసామ్రాజ్య పీఠస్థులం గావించె. తత్సంబంధ బాంధవంబున వసుంధరాభారధౌరంధర్యంబున, దిగ్గంధసింధుర ఖటకూట, కపటకిటి, కచ్ఛపావతార నారాయణభుజంగభూధరంబులకుఁ దోడుజోడై, రాయగురుపరమేశ్వర, సాధుజనవిధేయ, ఘోడెరాయ, సకలకళాధామ భీమయగురువరేణ్య పుణ్యకారుణ్యకటాక్షవీక్షాలబ్ధసుస్థిరైశ్వర్యధుర్యుఁడై విజయధాటీసమాటీక నంబుల దిశ లల్లాడ నల్లాడభూవల్లభుండు రాజమహేంద్రంబు రాజధానిగా సింహాద్రిపర్వతంబు లక్షకళింగ, యవన, కర్ణాట, లాటాంతరీపం బైనప్రతాపంబున, దిలీప, నహుష, నా భాగ భరత, భగీరథ, మాంధాతృ, దుంధుమార, వూరు, పురూరవప్రాభవుండు, విశ్వవిశ్వంభరాభువనమండలంబు పరిపాలించె."

పై పెద్దవచనమువలన విష్ణుపాదమందు శూద్రజాతి పుట్టె ననియుఁ అది 1 పద్మనాయక, 2 వెలమ, 3 కమ్మ లను శాఖాత్రయంబు