పుట:Kavijeevithamulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

కవి జీవితములు

మ. ఘనుఁడన్ వేములవాడవంశజుఁడ దాక్షారామభీమేశనం
    దనుఁడన్ దివ్యవిషామృతప్రకటనానాకావ్యధుర్యుం డభీ
    మన నాపేరు వినంగఁ జెప్పితి వెలుంగాధీశ కస్తూరికా
    ఘనసారదిసుగంధవస్తువులు వేగన్ దెచ్చి లాలింపురా.

ఇందలి "వెలుంగాధీశ" యనుపదమునకు విమలాధీశుఁ డని యర్థము కొందఱు చెప్పుదురు. అట్లే యయిన నితఁడే రాజనరేంద్రునితండ్రి. ఇతఁడు శాలివాహన సం. 937 న రాజ్యమునకు వచ్చి శాలివాహన సం. 944 వఱకు రాజ్యముచేసెను. ఇతఁడు రాజ్యమునకు రాకపూర్వము 27 సంవత్సరముల నుండి వేఁగిదేశ మరాజకముగా నున్నట్లు మనకుఁ జాళుక్యవీరవాదశాసనముంబట్టి కాన్పించును. దీనినే సూచించుశాసనములు పెక్కులుగలవు.[1] ఈపద్యమునాఁటికి శాలివాహన సం. 927 పైఁగా నయినది. విమలాదిత్యుఁడు మఱియొక పదిసంవత్సరములకే రాజ్యమునకు వచ్చినట్లు కాన్పించుచున్నది. ఈసమయములోపలనే కళింగనగరమం దుండెడికళింగరాజులు తమ యధికారమును బలపఱుచుకొనినట్లుగాఁ బైగ్రంథమునందే చెప్పఁబడి యున్నది. [2] దీనింబట్టి భీమకవి శాలివాహన సం. 944 నకుఁ బూర్వమందే యున్నట్లుగా నెన్నవలసి యున్నది. ఇదియే నిశ్చయమైనట్లుగా శ్రీనాథుఁడు తాఁ జేయుచున్న కవిస్తుతిలోఁ బ్రారంభమునందు

సీ. "వచియింతు వేములవాడభీమనభంగి, నుద్దండలీల నొక్కొక్కమాటు"

అని భీమకవిపేరు చెప్పి పిమ్మట

"భాషింతు నన్నయభట్టుమార్గంబున, నుభయవాచాప్రౌఢి నొక్కమాటు"

  1. న్యూయలు దొరగారి దక్షిణ దేశపురాష్ట్ర వృత్తాంతములోఁగూడ "At that period (in A. D. 977) there ensued a period of anarchy in the Eastern Chelukya territories which lasted for 27 years at least" అనఁగా శాలివాహన సం. (క్రీ. శ. 977) 900 గలకాలమున నొక యరాజకావస్థ తూర్పుదేశపు చాళుక్యులలోఁ దటస్థమై యది యించుమించు గా 27 సంవత్సరములదాఁక నున్న దని యర్థము.
  2. (See page 183 of Mr. Sewel's Lists Vol. II.)