పుట:Kavijeevithamulu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

కవి జీవితములు

భము. అయినను అట్లు చెప్పిన నాంధ్రభాషలో నది రసహీన మగు నని యెంచి శ్రీనాథుఁ డట్టిపట్లను మిక్కిలి మెలకువతోఁ దెనిఁగించుచు వచ్చెను. అవి సంస్కృతమాతృకను దగ్గర నుంచుకొని పరిశీలించినంగాని స్పష్టములు కావు. అటుగావున వాని నిప్పుడు వివరింపక సమముగాఁ దెనిగించినయొకశ్లోకమును పద్యమును నిట వివరించెదను :-

"శ్లో. అధిగత్య జగత్యధీశ్వరాం దథ ముక్తిం పురుషోత్తమా త్తతః
      వచపామపి గోచరో నయ,స్స త మానంద మనిందత ద్విజః. నైషధము 2. సర్గము.

గీ. అట్లు పురుషోత్తముం డైనయతనివలన, ముక్తిఁ గాంచినయాద్విజముఖ్యుఁ డెలమి
    డెందమునకును వాక్కున కందరాని, యధికతర మైనయానంద మనుభవించె."

ఈ గ్రంథములో గ్రంథాంతమునం దొకపద్యము భాస్కరరామాయణములోనిపద్యముతోఁ బోల్పందగి యున్నది. ఆ పద్యముం జూచిన నీశ్రీనాథుని కవిత్వనై పుణి బోధ యగును.

రామాయణములోనిపద్యము.

శా. లాటీచందనచర్చ, చోళమహిళా లావణ్యసామగ్రి, క
     ర్ణాటీగీతికళా సరస్వతి, కళింగాంతఃపురీమల్లికా
     వాటీమంజరి, గౌడవామనయనావక్షోజహారాళియై
     పాటింపం దగు నీదుకీర్తి రథినీపాలాగ్రణీ సాహిణీ."

శృంగారనైషధములోనిపద్యము.

శా. లాటీచిత్తసరోమరాళ, కుకురీలావణ్యలోలాత్మ, క
     ర్ణాటీనృత్తకళావిలోకన సమారంభప్రియంభావుకా
     భోటీనేత్రచకోరచంద్ర, మగధీపుష్పాస్త్ర, చోళీకుచా
     ఘాటస్థాపితమన్మథాంక, కుహళీ గాఢాంకపాళిప్రియా."

శ్రీనాథుఁ డీగ్రంథమును దన ప్రౌఢవయఃకాలములో రచియించినట్లుగఁ జెప్పె ఈగ్రంథమును బెండిపూడి యన్న మంత్రికిఁ గృతి యిచ్చె. ఇతఁడును ముప్పదియిద్దఱునియోగులలోనివాఁడు కావున సుప్రసిద్ధుఁడే యగును. అం దితనిసీసరచణ మెట్లన్నను :-