పుట:Kavijeevithamulu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

271

యింపఁబడినభీమఖండములోఁ దద్గ్రంథకృతిపతి యగుబెండపూడి యన్నమంత్రి వంశవర్ణనము చేసి యప్రస్తుతముగా నాయన్న మంత్రికిఁ బ్రభుం డగు వేమభూమీశ్వరునివంశమును వర్ణించుటంబట్టి చూడ నందు మూలముగ నైనఁ దనపేరు రాచవేమభూపాలుని చెవిం బడఁగల దను కోర్కెతో శ్రీనాథుఁ డట్లు చెప్పుటకు సందియము లేదు. అన్నమంత్రి మూలముగ శ్రీనాథుఁడు వేమభూపాలునిమన్నన వడసి యుండుటంబట్టియే చివరకావ్య మగుకాశీఖండము రచియించుటయును, తదాదిగ నాప్రభునియాస్థానపండితుఁడై యుండుటయును దటస్థించె నని యూహింపనై యున్నది. కావున శృంగారనైషధగ్రంథము నందిన మామిడిసింగన యొకబోగముదానిం దెచ్చియిచ్చినం గాని నీయింట భోజనమునకు నిలువ నని శ్రీనాథునిచేఁ బల్కింపఁబడునంత నీచస్థితిలోఁగాని నీచజన్మములోగాని యున్నాఁ డని చెప్పఁజాలియుండఁడు. శ్రీనాథుఁడు సింగనమంత్రి యనుగ్రహము సంపాదించుకొనినచోఁ దనకు విశేష ధనసహాయము గల్గుటయే కాక యెప్పటికైన నతనిప్రభుఁ డగు వేమభూపాలునిదర్శనముగూడఁ గల్గు నని యూసించియు నుండును. అట్టిచో శ్రీనాథుఁడు సింగనకు నతని యజమానియైననుఁ జెప్పఁజాలనంత యతినీచకార్య మగుతార్పుడుపని చేయు మని చెప్పియుండఁడు. శ్రీనాథుఁడు స్త్రీలోలుఁ డని వాడుక యున్నది గావున నీకథ పామరజనములచేఁ బన్నంబడి యున్నట్లుగా నూహింపవలసి యున్నది.

ఈమామిడిసింగమంత్రి ముప్పదియిద్దఱు నియోగులలోని వాఁడు. ఆ సీసపద్యములో నతనింగూర్చినచరణ మెద్దియన.

"ఆంధ్ర నైషధకావ్య మందె శ్రీనాథునిచే మామిడిసింగనామాత్యమౌళి"

శృంగార నైషధగ్రంథ శయ్యాదికము.

ఇది సంస్కృతమునకు సరియైన తెనుఁ గని చెప్పఁదగి యున్నను నక్కడక్కడ నుభయభాషలకును జాతీయభేదము లైనచో మాత్రము కొన్ని మార్పులు కాన్పించు. ఆ మార్పులు చేయక చెప్పుటయే సుల