పుట:Kavijeevithamulu.pdf/276

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
270
కవి జీవితములు

షష్ఠాశ్వాసాంతమున

క. అరివీరబసవశంకర, శరణాగతరక్షణానుసంధానధురం
    ధరసచివగంధసింధుర, ధరణీభరణైకదక్ష దక్షిణహస్తా.

పైపద్యము లన్నియును బర్యాలోచించి చూడఁగా నీసింగమంత్రి కిం గలబిరుదు లన్నియు స్పష్టము లగును.

1. త్రిభువనరాయ వేశ్యాభుజంగుఁడు.
2. కదన గాండీవి.
3. జగనొబ్బగండఁడు.
4. పాండ్యరాజ గజకేసరి.
5. కేళాదిరాయఁడు.
6. కర్పూరవసంతరాయఁడు.
7. పల్లవాదిత్యుఁడు.
8. వీరనారాయణుఁడు.
9. అరివీరబసవశంకరుఁడు.

ఇట్టిమహాబిరుదము లన్నియు వేమారెడ్డి సింగమంత్రికి నొక్క మాఱుగనే యిచ్చి యుండె నని యూహింప లోకానుభవవ్యతిరేకమై యుండును. ఒక్కొక్కబిరుద మొక్కొకమహాకార్యము చేసినప్పు డీ యంబడుట నైసర్గికము. ఇట్టిబిరుదు లన్నియు నీసింగనమంత్రిచేత నైషధగ్రంథరచనకుఁ బూర్వము పరిగ్రహింపఁబడినట్లుగనే యెంచవలయును. కాఁబట్టి నైషధగ్రంథమునకుఁ బూర్వము సింగమంత్రి కేవలము నొకగ్రామమునకు మిరాసీదారుఁడుగాక తండ్రితాతలనాఁటి నుండి సంక్రమించిన రెడ్డి సంస్థాన మహామంత్రియై యుండె నని చెప్పవలసి యున్నది. ఇదియును గాక ? శ్రీనాథకవిచేత నావఱకే యీసింగనమంత్రి యన్న యగుప్రెగడన దండనాథు డొకకృతి నందినట్లుగ నీ గ్రంథములోనే యున్నది ఎట్లన్నను :-

"క. జగము నుతింపఁగఁ జెప్పితి, ప్రెగడయ్యకు నాయనుంగు పెద్దనకుఁ గృతుల్
     నిగమార్థసారసంగ్రహ, మగునాయా రాధ్యచరిత మాదిగఁ బెక్కుల్."

ఇ ట్లుండుటంబట్టి శ్రీనాథకవి సింగనమంత్రివంశస్థులకు నపుడపుడు గ్రంథములఁ గృతి నిచ్చుచు నుండునాస్థానకవిగా నూహింపనై యున్నాఁడు. ఇంతవఱకును శ్రీనాథునకు రాచవేమభూమీశునిసభలోఁ బ్రవేశము కల్గినట్లే తోఁచదు. శృంగారనైషధగ్రంథానంతరము రచి