పుట:Kavijeevithamulu.pdf/267

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

261తనికుమారుని బిరుదంబులంబట్టియు, జైమినిభారతములోనివర్ణనంబట్టియు, శ్రీనాథునిచే వర్ణింపఁబడిన తెలుఁగురాయండును నీతెలుంగురాయండును నొక్కఁడే యని నిశ్చయింపఁదగి యుండును. ఆపద్యము లెవ్వి యనఁగా :-

మ. గురిజాలాన్వయదుగ్ధవార్ధిశశి దిక్కుంభీంద్రహస్తాభబం
     ధురభూభారధురీణనిశ్చలమహాదోర్దండుఁ డుగ్రారిభీ
     కరుఁ డై దిక్పరివర్తికీర్తి నెగడం గా భూరిభోగాఢ్యుఁ డై
     పరఁగెం ధాత్రిఁ దెలుంగురాయఁడు జగత్ప్రఖ్యాత రాజ్యోన్నతిన్.

చ. అతనికి నగ్రభార్య వినయాంచిత నిత్యశు భైకశీల సు
    వ్రత నియతాత్మ సజ్జనపరాయణ ధర్మవివేకసార స
    న్నుతహృదయానుకూల సుగుణోజ్జ్వల నాఁదగుమల్లమాంబయం
    దతులితరామలక్ష్మణశుభాకృతు లిద్దఱు పుట్టి రాత్మజుల్.

వ. అం దగ్రసంభవుండు.

క. శ్రీకంఠుఁడు సకలజనవ, శీకరణసుకీర్తియుతుఁడు చిరతరగుణర
   త్నాకరుఁడు సతతదానద, యాకల్పుఁడు ముప్పదిక్షమాధీశుఁ డిలన్.

ఆంధ్రపద్మ పురాణోత్తరఖండము.

"వ. ఇతఁడు సోదరుం డగుముత్తభూపాలుండు సహాయుండు గా గౌతమీదక్షిణంబున బరమపావనం బైనసబ్బనాపి రాష్ట్రంబున, రామ గిరిపట్టణంబు నిరాజధానిగ, బురందరవిభవుం డై రాజ్యంబు చేయుచు, నీరునెత్తురుగండ, గోపాలకాంచిరక్ష పాలక, చోడరాజ్యస్థాపనాచార్య, దొంతిమన్ని యవిభాళ, చలమర్తిగండ, గజగంధవారణ, రాజగజకేసరి, మూరురాయజగదళవిభాళాది నానాబిరుదవిఖ్యాతుం డై ముప్పభూపాలుం డుండు" అని యున్నది.

పైపద్యములంబట్టి తెలుంగురాయఁ డనునొకపెద్దరాజుగాఁ దెలియవచ్చుచున్నది. చోళరాజ్యస్థాపనాచార్యబిరుదు లీతని వంశమువారికిఁ గల్గియుండుటంజేసి వారు చోళరాజులప్రభుత్వములో సామంతమండలాధిపులుగా నున్నట్లును, ఆచోళరాజులు క్షీణించుసమయములో నాసంస్థానమువారు కర్ణాటాంధ్ర రాష్ట్రములలోఁ గొంతభాగము నాక్రమించుకొని యున్నట్లును నూహింపనై యున్నది. ఈ రాజులవంశనామము గురిజాలవారు అని కలదు. ఇతనింగూర్చి దేశచారిత్రములో వివ