పుట:Kavijeevithamulu.pdf/261

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

255బ్రాగ్దక్షిణభాగముల నున్నవి. "దక్షిణాధీశునిముత్యాలశాల" అనునది కేవలమును దక్షిణదిక్కున నున్న ట్లూహింప నై యున్నది. దీనింబట్టి చూడ శ్రీనాథుఁ డాంధ్రదేశము నలుప్రక్కలం దిరుగుటయే గాక యా దేశమునకు సమీపంబున నున్న ద్రావిడకర్ణాటదేశములను నోఢ్రదేశమునుంగూడ దిగ్విజయార్థమై చూచియున్న ట్లూహింప నై యున్నది.

శ్రీనాథుఁడు రాయనిసంస్థానమునకుం బోవుట.

పైపద్యములో వివరించినశ్రీనాథునిదిగ్విజయములలో మొదటి రెండును స్థలనిర్దేశములే కానివి కావున వానిని వదలి యితఁడు రాయలసంస్థానమునకుఁ బోయి యున్న పుడు జరిగిన వృత్తాంతమును, రావుసింగభూపాలునిసభకుం బోయియున్నపుడు జరిగినవృత్తాంతములను గొంత వివరించెదను. అందు మొదటిది రాయలయాస్థానమందు జరిగినవిశేషములు. అచ్చోటికి శ్రీనాథుఁడు పోయియున్నపుడు శ్రీనాథుఁ డని యెఱుఁగక రాయలు నీవాసస్థాన మెచ్చోటను అని యడిగినసంప్రశ్నమునకు శ్రీనాథుం డిట్లుగా నుత్తర మిచ్చెను. ఎట్లన్నను :-

కొండవీటివర్ణనము.

సీ. పరరాజపరదుర్గపరవైభవశ్రీల, గొనకొని విడనాడు కొండవీడు
    పరిసంథిరాజన్యబలముల బంధింప, గురువైనయుఱిత్రాఁడు కొండవీడు
    చటులవిక్రమకళాసాహసం బొనరించు, కుటిలారులకుఁ జోడు కొండవీడు
    ముగురురాజులకును మోహంబు పుట్టించు, కొమరున మించినకొండవీడు

గీ. చటులమత్తేభసామంతసారవీర, భటనటానేక హాటక ప్రకటగ్రంథ
    సింధురార్భట మోహనశ్రీలఁ దనరు, కూర్మి నమరావతికిఁ జోడు కొండవీడు.

ఇట్లు శ్రీనాథుఁడు పలుకఁగా రాయ లతనిని శ్రీనాథునిగా నెఱింగి యథోచితసత్కారంబు లాచరించి తమపట్టణమునఁ గొన్ని దినంబు లుండుటకుఁ బ్రార్థించెను. శ్రీనాథుఁడును దానికి సమ్మతించి యుండెను. ఇదివఱలో శ్రీనాథునిచేఁ జెప్పఁబడిన సార్వభౌమబిరుదము స్థిరపఱుచుటకు జరిగినసం వాదముగాని దానికిం గల్గు కారణములుగాని తెలు