పుట:Kavijeevithamulu.pdf/246

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
240
కవి జీవితములు

"గీ. పల్లవం బూని సకియమే నెల్లఁ జేసి, పద్మగర్భుండు లా దీసి వాగుడిచ్చి
     బూవిసర్జించి యప్పు డప్పూవుఁబోఁడి, డెంద మొనరించె సందేహ మొంద నేల."

ఇంకను ననేకపద్యంబు లున్నయవి. ఇవి యన్నియుఁ బాండురంగవిజయంబులోని వని యందురు. పాండురంగ విజయమునకుఁ గథానాయకు దనపేరిటివానినే నిర్మింప దలంచి తననామాంతర మైనపాండురంగఁ డనుపే రిడెనఁట! చాటుధార నీతఁ డనేకపద్యంబులు సెప్పి యుండెను :-

దశావతారపద్యములు

విష్ణునిదశావతారంబులఁ బద్యదశకంబున వర్ణించె. దానిం జూచిన నీతనిసంత్కృతసాహీతిపటిమయు సమాసకల్పన లోనిప్రజ్ఞయుఁ గాన్పించును కావున వాని నీక్రింద వివరింతము :-

శా. పాధీయోముఖపూరితోద్వమితతాసత్యోర్ధ్వగోదన్వద
     ర్ణోధారాంతరట త్తిమింగిలగిల ప్రోద్ధాన నిధ్యానల
     బాధీశప్రభుతాస్వభాగహరణార్థాయాయినాథానుజ
     ప్రాధా న్యాతివిలోలవాగ్ద్రుగబటబ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్. 1

శా. ద్యూత్తుంభద్గిరికల్పితావతరణద్యోదాహినీసంగమో
     పాత్తేందూదయనిష్పితౄణజలధిప్రారబ్ధపుత్త్రోత్సవో
     దాత్తక్వాక్తగజాశ్వవన్యశనక న్యాగోమణీదానసం
     పత్తిప్రీణితదేవఢుల్యధిపతిబ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్. 2

శా. ఆద్యాలోకనభక్తి సంభ్రమదనేహఃపూరుషత్యక్తస
     త్పాద్యాంభస్తులపీభ్రమప్రదఖురప్రక్షాళ నామాత్రజా
     గ్రద్యోగాంబుధిదంష్ట్రికాగ్రరిపుహృత్కాలామిషప్రాయశుం
     భద్యాదోనిధిప ప్తకీస్థలికిటిబ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్. 3

శా. డింభద్రోహివధోత్కటోత్క్రమణదుష్టిక్లిష్టతారోమకూ
     పాంభోజప్రభవాండభాండదళ నోద్యద్ధ్వానధీకృత్సభా
     స్తంభాంతస్ఫుటవస్ఫురత్పెళ పెళధ్వన్య స్త నిశ్చేష్టని
     ర్దంభోద్యోగదిశావకాపనృహరిబ్రహ్మన్ స్తుమ స్త్వామనున్. 4

శా. స్వతలస్వచ్ఛతరారుణత్వరచితస్వస్త్రీపరేడ్భ్రాంతివా
     క్ప్రతికూలత్వదశానుకారిగళ గాద్గద్యక్షమాంభోజభూ