పుట:Kavijeevithamulu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

221



వృత్తాంతంబు మనంబునకు సంతసంబు పుట్టింప నాస్థానంబునకు వైళంబ వచ్చి రామకృష్ణుం బిలిచి యిట్లనియె. "ఓయీ ! పైత్యరోగికిఁ బాలు రుచ్యంబులుగాక తద్రోగాంతంబున దానిమేలిగుణంబు లగుపడునట్లు భట్టుమూర్తిగుణంబు లిపుడిపుడు గొప్ప పండితులకుఁ గాన్పించెడినికంటే?" అనుడు నవ్వి "దేవర యట్టిపండితు లెవ్వరో యెఱిఁగించిన ననంతరవృత్తాంతంబు మనవి సేయుదు ననుడు రాజు తొల్లింటిపద్యము చదివెను. దానికి రామలింగము నవ్వుచు నా పద్యము మరలఁ జదివితుదిని కాక, మానురాయ నీకుఁ దగురా అని కాక అనుదాని వేఱుచేసిన రాజు నీయభీప్రాయంబు స్పష్టీకరింపు మనియె. అపుడు రామకృష్ణుఁడు భట్టుం జూపి "యీతనికంచుకము దీయించిన మనసంశయము లుండ వనుడు రాజు దాని కాజ్ఞ యొసంగె. అపుడు రామకృష్ణుం డతనివీఁపున నున్న తామరం జూపి యతఁడు కూర్చుండెడుస్థలంబున నున్న స్తంభంబుఁ జూపి మానురాయ నీకుఁదగురా. అని యర్థంబుగాని యింకొకటి గా దనియె. దాని విని రాజును తేజు చెడి యూరకుండె. భట్టేమియుే బల్కనే లేేఁ డయ్యెను.

రామకృష్ణుఁడు వసుచరిత్రకృతి నాక్షేపించుట.

భట్టు రామరాజభూషణుఁడు వసుచరిత్రను రచియించి తెచ్చి సభలో వినిపింప నుండ రామలింగ మొకచిత్రకథ చేసె. అదెట్లనిన :-

ఒకానొకదినంబున భట్టురామరాజభూషణుఁడు పెద్దనమనుచరిత్రపాకచమత్కృతికి మనంబున నలరి యట్ల తాను నొకరసవత్ప్రబంధంబు గల్పింప నుత్సహించి రాయల కెఱిగించిన నాతఁడు కర్పూర తాంబూలజాంబూనదాంబరాభరణంబు లొసంగి కృతి నిర్మింపు మనుడు రామభూషణుం డత్యంతానందంబునం జని మిగులఁ బరిశ్రమం బొనర్చి మనుచరిత్రకు నెక్కుడురసోదంచితం బగువసుచరిత్ర యనునొకగ్రంథంబు రచియించి కృతి నొసంగ రాజున కెఱిఁగించిన నాతఁ డొకశుభదినంబున సభ సేసెద నని యాజ్ఞ యొసంగెను. అపుడు రామభూషణుండు