పుట:Kavijeevithamulu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

కవి జీవితములు



రామకృష్ణుఁడు మనల నుద్ధరింప సమర్థుం డయ్యును సమయం బగుడు నిజప్రతాపము గుప్తము సేసి వానరాలాపము లాలింపుచు మిన్నక యున్న పవమాననూనుంబలె నున్నాఁడు. అట్లు గావున నీతఁ డాయంజనాసుతుమాడ్కి రాజ కార్యమును బంధుకార్యమును జక్కంజేయఁగ విరోధిసముద్రం బవలీల దాఁట నున్నాఁడు. దేవర యాజ్ఞ యొసంగుఁ డనుడు, రాజును మిగులం బొంగి రామకృష్ణుఁ జూచి "నీ విక్కార్యము నెఱ వేర్ప నుత్సహింపు" మనుడు, రామకృష్ణుఁడు భాసురమందహాసవికసితముఖపంకజుం డై యేకగ్రీవం బైనసభం జూచి యిట్లనియె. "పండితర్షభులారా! నా కీవఱ కట్టిసామర్థ్యము లేకున్నను మహాకవివరామోఘవాక్పటిమచేతను బుధజనాశీర్వాదముచేతను ప్రభునియాజ్ఞ చేతను గల్గెడిని. తొల్లి యంజనాసూతి వృద్ధభల్లూకాధిపుచే నుత్సహింపం బడియేకదా ! స్వామికార్యనిర్వాహం బొనర్చె. అట్లే నే నీవృద్ధునిమాట పాటించి పగతు నశ్రమంబున గెల్చి రాజకార్యనిర్వహణం బొనర్చెద. కావున విరోధివలన భయ ముడుగుఁడు. ఎల్లి యాతని నేలికదర్శనమునకు రాఁబంపుఁడు. అపు డేను లక్షఘంటకవినామమున వేష ధారినై వచ్చెద. అనంతరవృత్తాంతము తనంతనే విస్పష్టం బగును. నే నిపుడే పనివినియెదను. అనుడు రాజు వల్లె యని తనయాస్థానము సాలించి నర్సనకు మఱునాడు దర్శనమునకు రా నాజ్ఞ యొసంగెను.

నర్సనయు మఱునాఁడు రాజాజ్ఞానుసారంబుగఁ జనుదెంచి రాజమందిరద్వారమున నిలిచి ప్రతీహారులవలన నాక్ష్మాభర్తకుఁ దనరాక యెఱింగించి పుచ్చెను. అపు డా రాజు సహస్రఘంటకవిం దోడ్కొని రాఁ దగువారలం బనిచె. వారును నాతని సగౌరవంబుగఁ దోడ్తెచ్చిన నాధరణీజానియు సామంతజనపరివృతుండై కతిపయపదంబులు దూరము నడిచి యెదురుగ వచ్చి కవిం గారవించి యాస్థానమునకుం దెచ్చి యర్ఘ్యపాద్యము లొసంగి ధన్యుండ నైతిఁ జుఁడీ యనునవసరంబున, దౌవారికుండొక్కరుండు వచ్చి రాజుం గై వారంబు సేసి "దేవరా ! హజారమున