పుట:Kavijeevithamulu.pdf/224

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
210
కవి జీవితములుయొసంగెను. అపుడు వా రందఱును నాలోచించి జ్యోతిషమున నీతని నాంధ్రకవితాపితామహుఁడు పరీక్షింపఁదగు ననిరి. దానికి రాజును సమ్మతించెను. అపుడు పెద్దలపల్కులాలించి పెద్దన తనలోఁ దా నిట్లని చింతించె. ఆహా ! యిదేటివృత్తాంతము ? వీరందఱును నాపైఁ ద్రోచి యున్నారు. రామకృష్ణునిసామర్థ్యము మన మీవఱ కెఱుఁగము. ఎదిరి సామర్థ్యము స్వసామర్థ్యము నెఱుఁగక పరువులిడిన భంగపా టగును. గావున నూరకుండుట లెస్స యని యూహింప ననువు గాకున్నది. నన్నీ వఱకు నీసభ్యులు బలుమానిసిగా నెన్ను చున్నారు. ఈతఱి నూరకున్న బండితమాని యనరే ? ఎట్లైనను నీయిక్కట్టుఁ దప్పించుకొనుటకై యాకున కందనిదియుఁ, బోఁకకు బొందనిదియు, నగు నొకసంప్రశ్నము గావించెదను. అనంతరము భగవంతుం డున్నాఁడు. అని నిశ్చయించుకొని రామకృష్ణుం జూచి జ్యోతిషమున స్వర్గలోక వార్తావిశేషము లిపు డెఱింగింపుమనియె. అట్టి ప్రశ్నమునకు రామకృష్ణుం డాతని నుతించి ఇదె చెప్పెద జూడు మని కన్నులు మూసి మిన్ను జూచి యంగుష్ఠము లెన్ని ఛాయల లెక్కించి రెండుగిఱుల గీచి యిట్లనియె. ఓభూపతిపుంగవా! మనశిరములకు సూటిగ నిపుడు నాకము న నా కేశుడు కొలువై యున్నాఁడు. ఎదుట నాతనియానందమునకై రంభాద్యప్సరసలు నాట్యము సలుపుచు వినోదములు సేయుచున్నారు. ఇపుడు రంభపాదనూపురము గళితమై ధరాతలమునం బడుచున్నది. ఒకయామములోపల నది యిచ్చోఁ బడును. నాబుద్ధిచే నాలోచింప నది యిం దొకగిరిం బడును. "భవంతి న భవంతిచ" అను పార్వతీదేవి శాపముచే దీనిస్థలము నిష్కరింప నలవి గాకున్నది, అనుడు రామకృష్ణునిపల్కులకు సభ్యులందఱును ఱిచ్చపాటున నుండిరి. యథాకాలమునకు నూపురమొక్కటి ఘల్లుఘల్లన మ్రోయుచు నాతనియిష్టదేవతానుగ్రహంబున నొకగిరిం బడి రెండవదానికి ద్రొర్లినది. అపుడు సభ్యు లందఱును రామకృష్ణుని బహుభంగుల నుతించిరి. రాజున