పుట:Kavijeevithamulu.pdf/193

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నందితిమ్మన.

179కార్యము సానుకూలం బవుటకు యత్నించు నని నమ్ముము. నీపితృసఖుండ నైననేను నీకింతమాత్ర ముపకారము నీయిష్టానుసారముగ నొనరింపలేకున్నచో నిచ్చో నుండులాభం బెద్ది?" అను తిమ్మనపల్కు లాలించి యాఱేనియాలు కన్నీ రొలుక నేడ్చుచుఁ గడచినవృత్తాంత మా మూలాగ్రముగఁ జెప్పినది. దాని నంతయు విని "తల్లీ నీ వింతమాత్రము చే భయంపడ నేల? ఈవారములోపల నీనాథుఁడు తనంతన నీకడ కరుదెంచి నిన్ను మన్నించును వగవకుము నేనుబోయి వచ్చెదను" అని నిజగృహమునకుఁ జనుదెంచి రహస్యమునం గూర్చుండి "రాజమహిషి నూరార్చుటకు నచ్చోఁ బ్రాగల్భ్యములు పల్కి వచ్చితిని. ఇపుడు కార్యం బెట్లు నిర్వహింతును. ఈవర్తమానము రాజునకుం దెలిసినచోఁ దలకొట్లగును. ప్రస్తావవశమున నన్యాపదేశముగఁ బల్కినచో నాతఁడు దీనిని గ్రహింపఁ దగుసమర్థుండు. అసాధ్యుఁడు. ఆవులించినఁ బ్రేవులు లెక్కించువాఁడు. పిమ్మట నెటువోయి యెటు లయ్యెడినో" అని యనేకవిధంబుల నూహించి కొంతవడికి మనంబు పదిలంబు సేసికొని తన యిష్టదేవతకు మ్రొక్కి యిట్లు నిశ్చయించె. ఇపుడే ఱేనిపేరిట నొకప్రబంధము రచించి దాన దీని కనుగుణం బగుకథ పొందుపఱిచెదను. అందుఁ బ్రస్తావవశంబునఁ బల్కునట్లు మదభిప్రాయము తేటపఱిచెదను రాజును గడు రసికుఁడుగావునఁ దనలోపమును దానిచే నెఱింగి సుపథంబున వర్తించు నటులైనమదీప్సితము సేకూఱును.

అని తలంచి పారిజాతాపహరణం బనుకథఁ గొని ప్రబంధమురచి యింప నారంభించెను. అందుం దొలియాశ్వాసముననే తనయభిప్రాయము తేటపఱిచి దానికిఁ దగుపద్యములు విరచించి దానిచేఁ దనయభీష్టంబు సిద్ధించు నని యెంచి గ్రంథ మంతయు వైళంబ పూర్ణము సేసి రాజునకుఁ దెలియఁబఱిచెను. అతఁడును గ్రంథములకుఁ గృతినాయకుఁడుగా నుత్సహించువాఁడు గావున నొకశుభదినమున సభఁ జేసి గ్రంథము జదువఁ దిమ్మనకు నాజ్ఞ యొసంగెను. అపుడు తిమ్మన తనమృదు