పుట:Kavijeevithamulu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లసానిపెద్దన.

169

    ఘాతవియుద్ధునీచక చకద్ద్వికచోత్పలసారసంగ్రహా
    యాతకుమారగంధవహ హారిసుగంథ విలాసకృత్యమై
    చేతము చల్లజేయవలె జిల్లున చల్లవలె న్మనోహర
    ద్యోతకగోస్తనీ మధుమధుద్రవ గోఘృతపాయసప్రసా
    రాతిరసప్రసారరుచిరప్రతి గావలె సారెసారెకున్."

అనునీపద్యంబుఁ జదివినపెద్దనకవిని రాజులు సభ్యులును నెంతయుఁ గొనియాడి యతనియశుధారం గీర్తించి యీయందెను ధరింప నతఁడే సమర్థుం డనిరి. అపుడు కృష్ణరాయం డాకవిగండ పెండేరముం గొని యాతనిపాదంబు పట్టికొని దానిం దొడిగెను. దానికి సభ్యులందఱును సంతసిల్లిరి. ఇట్లు గౌరవించినరాజుం గాంచి పెద్దన విశేషానందముతో నాతని నొగపద్యంబు చెప్పి దీవించెను. అదెట్లనిన :-

పంచపాది.

శా. క్షీరాంభోనిధియందు యోగసరణిం జిచ్ఛక్తిఁ బ్రాసించి త
   ద్గోరాజత్కకుదస్థగోపవిలసద్గో రాజగోలోకతా
   స్ఫా రాలోకనతేజగాత్రచలనస్వాంతాద్రిదంభోళికృ
   త్సారజ్ఞానసనందనాదిమునిబృందాధిక్యసామర్థ్యవాః
   పూరాకారత నిద్రఁ జెందుకరుణాంభో రాశి నిన్ బ్రోవుతన్.

ఈ పెద్దనకడ నొకభట్టు చిరకాలమువిధ్యాభ్యాసము సేయుచుండెను, ఈచిన్న వాఁడు విద్యకఱచుటయందు మిగుల శ్రద్ధాళుఁడై యుండువాఁడు కావున నీతనియెడఁ బెద్దనకు నెక్కుడుప్రేమ యుండి విద్యా మర్మముల నన్నిటిం గ్రమక్రమంబుగ బోధించెను. ఇట్లుండ నొకనాఁటి రేయిఁ బెద్దన పండియుండి యొకానొకవర్ణాంశం బూహించుచుండెను. అపు డీభట్టు గురుని పాదసేవ సేయుచునుండి స్వామీ ! మీ రూహించు వర్ణనకు బాధకంబు గలదు దాని నొంకొకవిధంబున నూహింపుఁ డని తద్విధం బెఱింగించె, దాని విని యత్యాశ్చర్యంబునఁ బెద్దన యిట్లుచింతించెను. అహహా ! నాకుం దోఁచనియీకఠినవర్ణనం బీతఁ డూహించుట చే వీనిమనోదార్ఢ్యంబు విశేషంబని తెలియుచున్నది, వీఁడు మత్సముం