పుట:Kavijeevithamulu.pdf/181

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లసానిపెద్దన.

167ధ్రమునందును సంస్కృతమందును గవిత్వము సమానముగఁ జెప్పఁ గలవారలు దీనిం గైకొనం దగుదు రనియె. దానికి సభలోనిపండితు లందఱు నాలోచించుచు నుండిరి. అంత నీయాంధ్రకవితాపితామహుఁడు లేచి నిలిచి యీక్రిందిపద్యముఁ జదివె దానికి సభ్యు లందఱును మెచ్చి యీ పెండేర మీతనికిఁ దగు ననిరి. నాఁటనుండియు నీతనికి "గవిగండ" యని బిరుదు గల్గినది. ఈతఁడు చెప్పినపద్యమును "ఆంధ్రకవితాపితామహునిసింహావ లోకనము" అని యందురు. అది యుత్పలమాలికా నృత్తమాలిక. ఎద్ది యనిన :-

"ఉ. పూఁతమెఱుంగులుం బొసఁగుపూఁపబెడంగులు సూపునట్టివా
    కైతలు జగ్గునిగ్గు నెనగావలెఁ గమ్మన కమ్మనన్వ లెన్
    రాతియుం బవల్ మఱపురాదనునాచెలియోర జంపుని
    ద్దాతరితీపులంబలెను దారసిలన్వలె లోఁ దలంచినన్
    బాతిగఁ బైకొనన్వలెను పైదలి కుత్తుకలోనిపల్లటీ
    కూఁత లనన్వలెన్ సొగసుకోర్కెలు గావలె నాలకించినన్
    చేతులకొద్ది కౌఁగిటను జేర్చినముద్దులచిన్ని పొన్ని మే
    ల్మూఁతలచన్ను దోయివలె ముచ్చట గావలె విచ్చి చూచినం
    డాతొడ నున్న మిన్నల మిటారపుముద్దులగుమ్మకమ్మనౌ
    వా తెరదొండపంటివలె వాచవి గావలెఁ బంటనూఁదినన్
    గాతరతమ్మిచూలిదొరకై జవటా డెడుగబ్బి గుబ్బ పె
    న్మూఁతల నున్న కాయసరిఁ బొల్చెడికిన్నరమెట్టుబంతిసం
    గాతపుసన్న తంతిబయకారపుకన్నడ గౌలవంతికా
    సాతత తానతానలపసం దివుటాడెడిగోటమీటుబల్
    మ్రోఁత లనన్వలెన్ వలపు మొల్లము గావలె నచ్చ తెన్గు లీ
    రీతిని సంస్కృతంబు పచరించినపట్టున భారతీవధు
    టీతపనీయగర్భనికటీభవదానసుపర్వసాహితీ
    భౌతిక నాట్యగప్రకర భారతభారత సమ్యగప్రభా
    శీతన గాత్మజాహృదయ శేఖరశీతమయూఖ రేఖికా
    పాతనఖప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
    జాతకతాళయుగ్మలయ సంగవిడంబి విడంబి కామృదం
    గాతత తేహిత త్తహితహాధిత గానసతానదింధిమి