పుట:Kavijeevithamulu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

కవి జీవితములు

ఈకవిరాయల సభాస్థలిలో ననేకసమస్యలు పూర్తి సేయుచు ననేకసమస్య లితరకవుల కిచ్చుచు విద్యావినోదంబులు పెక్కులు సేయుచుండును. వానిలో నితఁ డితరుల నడిగినవానిం గొన్నిటి నిట వివరింతము ఒకనొకదినంబున రాధామాధవుం డనుకవిశిఖామణి రాయలఁ జూడఁ జనుదెంచినఁ బరీక్షింప నితఁడు నియమింపఁబడియె. అతనిసామర్థ్యాతిశయంబులు చూడ నగరు, తొగరు, వగరు, తగరు అనుపదంబులు ప్రాసస్థానంబులం దుంచి శ్రీరాము లరణ్య వాసంబున కేఁగునట్లుగ వర్ణింపు మని యడిగెను, దాని కాతఁడు వల్లెయని :-

"చ. నగరు పగాయె నింక విపినంబుల కేఁగుడు రాజ్యకాంక్ష కుం
    దగరు కుమారులార యని తల్లి వగ ల్మిగులంగఁ దోఁపఁగాఁ
    దొగరున రక్షఁ గట్టి మదిఁ దోఁచక గద్గదఖిన్న కంఠియై
    వగరపుచున్నఁ జూచి రఘువంశవ రేణ్యుఁడు తల్లికిట్లనున్."

అని చదివిన నీతఁడు మెచ్చి "యోయీ భారతంబులోనికథ కావలయును" అనుడు వల్లె యని యాతఁడు. :-

"చ. తొగరుచి కన్ను దోయిఁ గడుఁ దోఁపగ గర్ణుఁడు భీమసేను పైఁ
    దగరు ధరాధరంబువడిఁ దాఁకినభంగినిఁ దాఁకి నొచ్చిన
    న్వగరుపుచున్ వెసం బరుగువాఱిన నచ్చటిరాజలోకము
    ల్నగరు సుయోథనాజ్ఞ మది నాటుటఁజేసి ధరాతలేశ్వరా."

అనుడుఁ బెద్దన యేదీ? భాగవతంబునఁ జెప్పు మనుడు నాతఁ డిట్లనియె :-

"చ. వగరుపుమాత్రమే వరుఁడు వశ్యుఁడు గాఁడు సఖీసఖత్వ మె
    న్న గరుడవాహనుండు మము నాఁ డటు డించుట లెల్ల యుద్ధవా
    తగ రని కాక మోహపులతాతనులైన విడంగఁ జూతురే
    తొగరుచి యోషధీశునకుఁ దోఁచునె యుమ్మలికంబు మాను నే."

అని చదివినయాతనియాశుధార కెంతయు నలరి రాయలకడ నాతని నెంతయు శ్లాఘించెను. రాయఁడు నాతనికి విషేషసన్మానంబు సేసి పుచ్చెను.

ఈపెద్దన పూర్తిచేసినపద్యంబు లనన్య భేదంబులు, ఒకానొక దినంబున రాయం డొక పెండేరంబు దెచ్చి యాస్థానంబునం దుంచి యాం