పుట:Kavijeevithamulu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

కవిజీవితములు.

ఆంధ్రపంచకావ్యకవులచారిత్రము.

10.

అల్లసాని పెద్దన

దీనిని విస్పష్టముగాఁ దెల్పుదృష్టాంతములు విశేసముగ లేవు. మనుచరిత్రములో నచ్చటచ్చట వివరించినసంగతులం బట్టి కొంచెము చారిత్రము సమకూర్పవలసి యున్నది. ఇతనిగ్రంథారంభస్తోత్రములం బట్టి స్మార్తుఁ డని తోఁచుచున్నది. స్మార్తులు సామాన్యముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుమారమావాగ్భామామణులను. వినాయకాదు దులను వర్ణించి పద్యములను రచియించెదరు. అట్లుగా నీతఁడును చెప్పెను. గాని తనగురుని వర్ణించి చెప్పినయీక్రిందిపద్యమువలన నాతఁడు స్మార్తుఁడు కాఁడేమో యని తోఁచుచున్నది. ఆపద్య మెట్లన్నను :-

క. కొలుతు న్మద్గురు విద్యా, నిలయు న్గరుణాకటాక్షనిబిడజ్యీత్స్నా
   దళితాశ్రితజనదురిత, చ్ఛలగాఢధ్వాంతసమితి శఠగోపయతిన్.

అనుదీనింబట్టి శఠగోపయతీంద్రునిశిష్యుం డైనట్లును వైష్ణవమత ప్రవిష్టుఁ డనియుం దోఁచెడిని.

ఈతఁడు నందవరీకు లను నియోగులలోనియొక వంశస్థుఁ డగునల్లసాని చొక్కనమంత్రి కుమారుఁడు. రాయలయాస్థానకవి శేఖరుఁడు, ఆంధ్రమున కెంతయుఁ బ్రసిద్ధుఁడు. సంస్కృతమునంగూడ నసమానప్రజ్ఞ కలవాఁడు, ఈతనికిఁ బూర్వు లగుపురాణకవులును, కావ్యకవులును నొనరింపని ప్రబంధకవనమునకుఁ గ్రొత్తత్రోవ లీతఁడు కల్పించుటంజేసి యాంధ్రకవితాపితామహుఁడని విఖ్యాతబిరుదు గల్గినది. ఈతని రాయలు