పుట:Kavijeevithamulu.pdf/164

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
150
కవి జీవితములుశ్రీరాముఁడు వైకుంఠలోకమునకుం బోవుటయు నుండును. ఇట్టిగ్రంథమును దెనిఁగించుటకు నుద్యోగించినవారిలో నిర్వురు ప్రధానులు. అందుఁ దిక్కనసోమయాజి యొకఁడు. కంకంటిపాపరా జొకఁడు నై యున్నారు. అందుఁ దిక్కనసోమయాజికృత మగును త్తరరామాయణ మతనిభారతముకంటెను బ్రాచీన మైనదియును బాపరాజకృతో త్తర రామాయణము నవీనగ్రంథములలోఁ బ్రాచీన మైనదియును నై యున్నది. ఇపుడు మనము ముందు తిక్కనసోమయాజికృతం బగునుత్తర రామాయణముంగూర్చి చెప్పి యనంతరము పాపరాజకృతో త్తరరామాయణముంగూర్చి వ్రాయుదము.

తిక్కనకృతనిర్వచనోత్తరరామాయణము.

ఇది వచనము లేకయే రచియింపఁబడుటంజేసి దీనికి నిర్వచనోత్తరరామాయణ మనునామము కల్గినది. అట్లు చెప్పుట ప్రౌఢకవిలక్షణము గావునఁ దానట్లు చెప్పెద నన్న ట్లీక్రిందిపద్యమువలనం గాన్పించును. ఎట్లనిన :-

క. వచనము లేకను వర్ణన, రచియింపఁగఁ గొంతవచ్చుఁ బ్రౌఢులకుఁ గదా
   ప్రచయము పద్యము లన పొం, దుచితంబుగఁ జెప్ప నార్యు లొప్పిద మన రే.

ఈనిర్వచనోత్తర రామాయణములోని కొన్ని పద్యములవలన నితనిచారిత్రమును, నితనిప్రభు వగుమనుమసిద్ధి రాజితనికిఁ జేసినగౌరవమును గోచరం బగును గావున వానిని యథోచిత స్థానంబుల వివరించెను.

గ్రంథారంభము.

తిక్కన తనపూర్వు లగుగ్రంథకర్తలవలెనే గీర్వాణశ్లోకము కృత్యాదిని మంగళాశాసనముగాఁ జెప్పెను. ఎట్లన్నను :-

శ్లో. శ్రీ రాస్తాం మనుమక్షితీశ్వర భుజస్తమ్బే జగన్మణ్డలం
   ప్రాసాదస్థిరభారభాజి దధతీ సా సాలభఞ్జిక్రియా
   శుణ్డాలోత్తమగణ్డభిత్తిషు మదవ్యాసఞ్గ వశ్యాత్తయా
   యా ముత్తేజయతే తరాం మధులిహా మానన్దసాన్ద్రస్థితిః.