పుట:Kavijeevithamulu.pdf/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయ్యలరాజు రామభద్రయ్య.

147అనంతరము రాజు గ్రంథంబు నాఁటికినిలిపి యింకొకదినంబున దాని వినియెద మని సభ చాలించెను. భట్టుమూర్తి చింతాక్రాంతుఁడై యింటికిఁ జనియె. సభ్యులందఱును సభావిశేషములు చెప్పుకొనుచు :-

"శ్లో. విద్యా వివాదాయ ధనం మదాయ, శక్తిః పరేషాం పరిపీడనాయ,
    ఖలస్య సాధో ర్విపరీత మేతత్, జ్ఞానాయ దానాయ చ రక్షణాయ."

అనుశ్లోక మిచ్చో నెట్టు లన్వయించెనో చూచితిరే యని వాని చెట్టలఁ దలంచుచుఁ జనిరి. మూర్తియు గృహంబునకుం జని యారాత్రి తనయుపాసనాదైవం బగునాంజనేయుని ధ్యానించి రామభద్రకవిని సంహరింపుఁ డని ప్రార్థించెనఁట! అతఁడు నుద్దండగదాదండంబుఁ బూని రామభద్రునొద్దకు సంహరింప నేతెంచి యచ్చో ధనుర్బాణధరుఁ డగుశ్రీరాముని నతనితమ్ముఁడగు లక్ష్మణుని గని నమ్రుఁడై నమస్కరించి మీ రుండుచోటునకు నన్నుఁ బంపినమహాపాతకుం దునిమెద నని చెప్పి మరలి వచ్చి భట్టుమూర్తిని తనగదతో మొత్తెనఁట. ఆదెబ్బకే భట్టుమూర్తి నిర్యాణము నందెనఁట. రామభద్రకవి తనగ్రంథమును వసుచరిత్రమును గృతి నందినతిరుమలరాయని మేనల్లుం డగుగొబ్బూరి నరసరాజునకుం గృతి యిచ్చెను.

అప్పకవీయములో నున్న రామభద్రకవి వర్ణనము.

ఆంధ్రకవులవర్ణించుచు, నప్పకవి యీక్రిందిపద్యము వ్రాసెను. అది యెద్దియన :-

"సీ. శబ్దశాసనుపాద జలజంబులు భజించి, యుభయసత్కవిమిత్రు నభినుతించి
    శంభుదాసునకు నం జలి వేడ్క నొనరించి, సహజపాండిత్యుని సంస్మరించి
    సకలవిద్యాసనా థకవీంద్రుఁ గొనియాడి, సౌజన్యజేయువాక్సరణిఁబొగడి
    తగ నాంధ్రకవితాపితామహు వర్ణించి, సుజనవిధేయు హెచ్చుగ నుతించి

తే. రామరాజవిభూషణరత్న ఖచిత, చారుమస్తకలాపాదిహారివాక్య
   గౌరవము పెక్కుభంగుల గణన చేసి, పిదప నితరాంధ్రకవులకుఁ బ్రియముపల్కి."

ఇందు గేవలమును కావులనామములు చెప్పఁబడక వారివారిగద్యములలో నుండినవిశేషణములుమాత్రము చెప్పఁబడినవి. అట్టిగద్యముల