పుట:Kavijeevithamulu.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
4
కవి జీవితములునం దొకకుఱ్ఱం డీతఁ డన్ని యాటలం గెల్చుకొనుచుంట సహింపలేక యితనిలోపము లెన్నఁదలఁచి "యోకుఱ్ఱలారా ! మన మాతండ్రిలేనివానితో నాఁడ నేల? మనలో మన మాఁడుకొనుదము రండు" అని వారిం బిలుచుకొని పోవుడు భీమకవి మొగము చిన్నఁబుచ్చుకొని యచ్చోటు వాసి పోయి తనతల్లిం గాంచి యిట్లనియె. "అమ్మా ! మాతండ్రి యెచ్చో నున్నాఁడు? ఒకచో నున్న యెడల న న్నీ బాలు రి ట్లనుటకుఁ గారణం బేమి ? తండ్రిలేనివాఁ డని పెక్కుగఁ బల్కి యపహసించుట యేల కల్గె? దీనికిఁ గారణమ్ము దెలుపు మనుఁడు నమ్ముగుద యేమియు నన నోరాడక యూరకుండినది." అది త న్నవమానించుటగా నెఱింగి భీమన యొకఱాయి పెఱికికొని వచ్చి "మాతండ్రిమాట చెప్పెదవా ? లేకున్న నీతల శకలంబులు చేయుదునా; అనుఁడు నాపె భయ మొంది యిట్లనియె. "అయ్యా ! మీయయ్య దాక్షారామపు దేవళములో నున్న యాశిలయే. అతనియొద్దకుం బోయి నీవృత్తాంతమంతయు నడుగు మనుడు వల్లె యని యారాతితో నచ్చటికిం బోయి "యోయీ ! నీవు నాతండ్రివఁట ! నీ వుండ నన్నుఁ దండ్రి లేనివాఁడా యని నాస్నేహితు లన నవసరం బేమి? నీవు నాతండ్రివే యయిన యెడల వారి కందఱకును గాన్పించి నన్నిట్లనకుండఁ జేయుము" అనుడు నాదేవునివలన నేమియు నుత్తరము లేదయ్యెను. "అంతం గోపించి భీమనయేమీ యీమూర్ఖత నీవు మాట్లాడకున్న నీఱాతిచే నీశిరంబు శకలీభూతంబు గావించెదను" అనుడు నాయీశ్వరుఁడు వానియెడ వాత్సల్యము వహించి ప్రత్యక్షంబై నేను నీకుఁ దండ్రినే యగుదును. నీవు నాకు బిడ్డఁడవు. ఈవృత్తాంతము లోకములో నందఱకు నిఁకఁ దెలియును. పొమ్మనుఁడు యంతటితోఁ బోనీయక నే నీకొడుకునే యయిన నే నాఁడినది నాటయుఁ బాడినది పద్యమును నగునట్లు వర మి మ్మనుఁడు నవ్వి యమ్మహామహుం డట్ల వరమిచ్చి యంతర్హితుం డయ్యె. అట్టివరములం బడసి భీమన తల్లికడ కరుదెంచి యావృత్తాంత మాపెకుఁ దెల్పిన నాపెయు హర్షోత్కర్షము నందినది. భీమన నాఁటనుండియు నాబాలురతోఁ