పుట:Kavijeevithamulu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

కవి జీవితములు



ప్రగ్గడ రాయనిభాస్కరుఁడే యనియును నతనిదానశాసనకాలము శా. సం. 1138 అవుటంబట్టి భాస్కరునికాల మదియే యనియును వ్రాయఁబడియెను. కాని యీ శాసనము తిరుగా నొకపరి పరిశీలింతము. ఈ శాసనసంగ్రహ మింగ్లీషులో న్యూయలుదొరవలన బ్రాచీనశాసనపట్టికలో నీక్రిందివిధముగా వ్రాయఁబడియున్నది. ఎట్లన్నను :-

"(35) On the Same. S. S. 1138 (A. D. 1216) Grants by Bollana, Brahman "minister" and by Rayana Peggada, Commander of the Forces of Sriman Mahamandalika Gunturi Odaya Rajah"

దీనింబట్టి చూడఁగా శ్రీమన్మహామండలీక గుంటూరియుదయరాజుయొక్క సేనానాయకుఁ డగురాయనప్రగ్గడవలనను, బొల్లన యను నొకబ్రాహ్మణమంత్రివలనను దానములు శా. సం. 1177 సంవత్సరమునం దీయఁబడినట్లుగాఁ గాన్పించును. ఇందులో గుంటూరిప్రభునికి రాయనప్రగ్గడ సేనానాయకుఁడు గాని మంత్రి కాఁడు. మంత్రికిని సేనా నాయకునకును భేదము చాలఁ గలదు. కావున నాసమన్వయము సరిపడి యుండదు. ఇంతియకాక రాయనప్రగ్గడ యనఁగా రాయన్న యను మంత్రి యని యర్థమగును గాని రాయనిభాస్కరుఁ డని యర్థము కాఁ జాలదు. ఇట్టిశాసనబలంబున నీహుళిక్కిభాస్కరుని కాలనిర్ణయముఁ జేయుట యెంతమాత్రమును యుక్తియుక్తము గాదని యూహించెదము.

ఇఁక భాస్కరునికాలనిర్ణయము చేయుటకుఁ దగినసాధనము లేవి యని యూహింపఁగాఁ బ్రతాపరుద్రవంశచారిత్ర మనంబరఁగు సోమదేవరాజీయములో రుద్రమహారాజుసభకు హుళిక్కి భాస్కరుఁడు రంగనాథుఁడు మొదలగువారలు వచ్చుచుండి రనుకథంబట్టి యితఁడు రుద్రునికాలమువాఁ డని నిర్ణ యింపవచ్చును. కాని యారుద్రునికాలమును నాగ్రంథములో నొకవిధముగా విశదీకరించినను రుద్రనాము లిర్వురు మువ్వురుప్రభువు లుండుటచేత నొకరికాలమందు జరిగినవృత్తాంతము లింకొకరికాలములో జరిగినట్లు కాలనిర్ణయసామగ్రి లేకుండుటం