పుట:Kavijeevithamulu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హుళిక్కి భాస్కరుఁడు

131



మంత్రిభాస్కరునిమనుమఁడ" నని చెప్పెను దానిం బట్టి యీ రామాయణమును రచియించినభాస్కరుఁడే యతఁడు కానోవునా యని యొకసంశయము పొడముచున్నది. ఇట్టిసంశయమే కొందఱుపండితులకుం గల్గి శ్రీయాంధ్రాభాషాసంజీవనిలోఁ బ్రశంసింపఁగా, ఆ 1881 సంవత్సరము ఫిబ్రేవరునెల శ్రీ ప్రబంధ కల్పవల్లి "ఆంధ్రభాషాసంజీవనిలోని హుళిక్కి" యనుపేరిట నీక్రిందియుపన్యాసమును బ్రకటించినది. అది ప్రస్తుతాంశమున కెంతయు నుపయోగించును గనుక దాని నిట వివరింతుము. అదెట్లన్నను :-

తిక్కనసోమయాజియొక్క పితామహుఁడు మంత్రి భాస్కరుఁ డనియే సంజీవనిలోఁ బలుకఁబడెను గాని హుళిక్కి భాస్కరుఁ డని కాదు "మంత్రిభాస్కరు మత్పితామహునిఁ దలంచి" యని సోమయాజియే స్వరచితనిర్వచనోత్తర రామాయణముయొక్క ప్రథమాశ్వాసమున న్వక్కాణించెను. మంత్రిభాస్కరుఁడే హుళిక్కిభాస్కరుఁ డని ప్రబంధకల్పవల్లీవి లేఖకులు నిష్కర్షించుటకుం గలకారణముల నెఱుంగ నుత్సహించుచున్నారము" అని యుండెను. మఱియును సోమయాజిగారు స్వకృతభారతమున దేవా ! జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె." అని యనియే వాగనుశాసనమతానుసారులై రచియించిరి. కాని వారు భారతమునకంటెఁ బూర్వము రచియించిననిర్వచనోత్తర రామాయణమునందుఁ దమతాత యైనమంత్రిభాస్కరునిపథకము ననుసరించిరి. అదెట్లన్నను; సకలసుకవిజనప్రణుతయశస్కర భాస్కరప్రణీతం బైనశ్రీరామాయణమునం దారణ్య కాండంబునఁ బ్రథమాశ్వాసము తుదను "శా. పుణ్యుండూర్జిత... ఉర్వినెందున్" అనియు నీ మొదలగుకొన్ని సంగతులు వ్రాసియుండెను, దానిచే సంజీవనిలో రామాయణ గ్రంథకర్థ యగు మంత్రిభాస్కరుఁడు తిక్కనసోమయాజికిఁ దాత యనియే తెలిసినది.

1. ప్రథమమున నిర్వచనోత్తర రామాయణములోఁ దనకుఁ బితామహుఁడు గుంటూరివిభునిమంత్రిభాస్కరుం డనియు, నతనిమనుమఁ