పుట:Kavijeevithamulu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

కవి జీవితములు

    బట్టిసపురవీరభద్రుని ప్రేమచేఁ, జెన్నొందె శ్రీకోటసింగ రాజు
    ఇలుచూర యాచకావళికి దాతలదాత, యై యిచ్చె నిట్టలహరివరప్ప
    తనదుమీసముఁ దీసి తాకట్టుగా నుంచి, కొఠ్ఠరెఱ్ఱం డర్థికోర్కెఁ దీర్చె
    గణపతిదేవునికరుణ భట్టుకు మణి, యడపం బొసంగె గుండార్యవరుఁడు
    అష్టసహస్రంబు లర్థి కిచ్చి సుకీర్తి, మహిని సింగనమంత్రిమాచఁ డుండెఁ
    గొనియే భాస్కరునిచేఁ దెగుఁగురామాయణం, బారూఢి సాహిణిమారమంత్రి
    యాంధ్రనైషధకావ్య మందె శ్రీనాథునిచే, మామిడిసింగ నామాత్యమౌళి
    ఘనదానకర్ణుఁ డై గండపెండెముఁ దాల్చెఁ, గొఱవియన్నా మాత్యకుంజరుండు
    పగతుఁ జుట్ట మటంచుఁ బల్కఁగా ధన మిచ్చి, చేపట్టెఁ బెమ్మయసింగరాజు
    గురుజగత్త్రయదానగురుమూర్తియై మించె, నండూరిభీమన్న గుండమంత్రి
    పాణికోటికి నెల్ల బహుభక్ష్యభోజ్యాన్న, సత్త్రము ల్పెట్టె విస్సప్రధాని
    భట్టుమూర్తికిఁ గిన్క రెట్టింపఁ బచ్చల, హార మర్పించెఁ దిమ్మరసుమౌళి
    ఘనదైవతంబు ద్రాక్షారామభీమేశుఁ, డని కొల్చె బెండపూడన్న మంత్రి
    నీడఁ ద్రొక్కెడునీళ నెఱి నర్థి కభిమతం, బిప్పించెఁ జేమకూరప్ప రాజు
    ఘనసప్తసంతతు లొనరించి సత్కీర్తి, వెలయించె విఠ్ఠలవెఱ్ఱమంత్రి
    యమితశత్రుల గెల్చి యవనిఁ బాలనఁ జేసె, రహి గుంటుపలి ముత్త రాజమంత్రి
    తను నేలునృపతిచేతనె మేటికృతిఁ గాంచె, శ్రీగుంటుపలినరసింగమంత్రి
    ఘనభట్టుసుకవికి మణికుండల మొసంగి, నందితిమ్మకవీంద్రుఁ డందెఁ గృతులఁ
    గవుల కర్థ మొసంగి ఘనకీర్తిని వహించె రహిఁ గూరగాయలరామమంత్రి
    వాకిటికావలిజోకతో నొనరించి, దివ్యకీర్తి వహించెఁ దిమ్మమంత్రి
    రిపు గెల్వ నృపుఁ డిచ్చువిపులార్థముల నర్థి, కర్పించెఁ గటికికామన్న మంత్రి
    కవిబుధావళి నేలి ఘనకీర్తిని వహించె, వరకోటిపల్లిశ్రీశరభమంత్రి
    నిరతాన్న దాతయై నిత్యకీర్తి వహించెఁ, గాశిబందాపరదేశమంత్రి.

ఈ పద్య మే నిజమగునదియేని (కాదనుట కాధారములు లేవు) సాహిణిమారుఁడు నియోగిబ్రాహ్మణుఁడు కాని వేఱుజాతివాఁడు కాఁడు. దీనికి వ్యతిరేకముగాఁ జెప్పఁబడినకథ యంతయు విశ్వసింపఁదగ దని నిశ్చయింపక తప్పదు. ఇఁక మంత్రిభాస్కరుఁ డెవరు? హుళిక్కిభాస్కరుఁ డెవరు? అను మీమాంస యొకటి యున్నది. ఆవృత్తాంత మీ క్రింద ముచ్చటింతము :-

మంత్రి భాస్కర, హుళిక్కిభాస్కరు లొక రని తిక్కనసోమయాజి తననిర్వచనోత్తర రామాయణములోఁ దాను "గుంటూరివిభుని