పుట:Kavijeevithamulu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

కవి జీవితములు



మారుని సంబోధన యున్నది. రెండవయాస్వాసాదియందును నట్లే యున్నది. ఈరెండాశ్వాసాంతములయందును సాహిణిమారునిపేరు స్పష్టీకరింపఁబడ దయ్యెను. ఈరెండాశ్వాసాంతగద్యములయందును "సకలసుకవిజనవినుతయశస్కరభాస్కరప్రణీతం బైన" యని యున్నది.

4. కిష్కింధాకాండము మొదటిపద్యములో సాహిణిమారుఁడు స్పష్టపఱుపఁబడలేదు. ఆశ్వాసాంతమునందు "రథినీపాలాగ్రణీ సాహిణీ" యని చెప్పఁబడియెను. ఈయాశ్వాసాంతమందును "అష్టణాషేత్యాదిభాస్కరసత్కవిపుత్త్రమలికార్జునభట్ట ప్రణీతం" బని యున్నది.

5. సుందరకాండారంభమున "సాహిణిమారా" యనుసంబుద్ధి యిన్నది. ఆశ్వాసాంతమున సాహిణిమారునివిశేషణములు లేక యీశ్వరునివిశేషణము లున్నవి. ఆశ్వాసాంతగద్యమందు "అష్టభాషేత్యాదిభాస్కరసత్కవిపుత్ర మల్లికార్జునభట్ట ప్రణీతం" బని యున్నది.

6. యుద్ధకాండారంభములో "సాహిణిమారా" యనుసంబోధన మున్నది. ఆశ్వాసాంతమునందు నీశ్వరనామంబే స్మరియింపఁబడినది. ముద్రితగ్రంథములలో మాత్రము ఆశ్వాసాంతగద్యమందు "అష్టభాషేత్యాదిభాస్కరసత్కవిమిత్త్రాయ్యలార్యరచితం బైన" అని యున్నది. క్రొత్తప్రతులలో నున్న దానిని ముందు తెల్పుదము.

దీనినంతయుఁ బరిశీలించి చూడఁగా నీగ్రంథము మొదట సాహిణిమారునిపేరిట నుద్దేశింపఁబడనట్లును ననంతరము కారణాంతరమున నితనిపే రందుఁ జేర్పఁబడినట్లును గాన్పించును. లేకున్నచోఁ గృతిముఖంబునఁ గృతిపతివంశము వర్ణించుటయును షష్ఠ్యంతములు మొదలగునవియును గాన్పింపక మానవు. అట్టివి లేవు గనుకనే సాహిణిమారుఁడు గుఱ్ఱపుకాసుదా రని కొందఱును గాదు తదితరుఁ డని కొందఱును క్షత్రియుఁ డని మఱికొందఱును వచియించుటకు నవకాశ మిచ్చెను. "బుద్ధయకుమారసాహిణిమా రా" యని యుండుటచేతను బుద్ధరాజుకుమారుఁ డీసాహిణిమారుఁ డనియు "మారయ