పుట:Kavijeevithamulu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య.

111

భారతీతీర్థులకాలము.

భారతీతీర్థులకాలమును నిర్ణయించుటకుఁ బూర్వము భారతీతీర్థులవృత్తాంతము చెప్పవలసి యుండును. ఇతఁడు శృంగేరిలోని జగద్గురుపరంపరలోని వాఁడును, వేదభాష్యకారుఁ డగుమాధవామాత్యాపరనామవిద్యారణ్యులతమ్ముండును నై యున్నాఁడు. ఇతనికే భారతీ తీర్థు లనియు, భారతీకృష్ణతీర్థు లనునామములు గలవు. జగద్గురుపీఠములోనివిద్యాశంకరున కీతఁడు ప్రథమశిష్యుఁడు. ఇతనియనంతరము విద్యారణ్యులు విద్యాశంకరస్వామిశిష్యుఁ డయ్యెను. అందుకుఁ గారణములు నావిద్యారణ్యచరిత్రములోఁ జూడం దగును, భారతీతీర్థులు యోగమార్గప్రవర్తకుఁడును, విద్యారణ్యులు కర్మబ్రహ్మమార్గ ప్రవర్తకుఁడునునై యున్నారు. ఈయిర్వురుం గలిసి యద్వైతమునకుఁ బ్రకరణగ్రంథ మగు పంచదశప్రకరణము అనుగ్రంథమును రచించిరి. భారతీతీర్థులు శా. సం. 1250 సన్న్యాసాశ్రమము గైకొని శా. సం. 1302 న సిద్ధి నొందెను. పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్యయు నీభారతీతీర్థుల శిష్యుఁడు గావున నించుమించుగ నీకాలమువాఁడే అని నిర్ణ యింపవలసి యున్నది.

పినవీరనశాస్త్రపాండిత్యాదికము.

ఇతఁడు భారతీతీర్థులశిష్యుం డగుటచేత యోగాభ్యాసపాటవంబు గలవాఁ డని చెప్పవలసియున్నది. యోగసిద్ధుఁ డనియునుఁ బ్రతీతి గలదు. పైభారతీతీర్థులు శృంగగిరిజగద్గురుపరంపరలోనివాఁడే అని చెప్పుటకు నీపినవీరనకవివలనఁ జేయంబడినభారతీవర్ణ నముచేతను పండితు లీతనివంశనామ మగు "పిల్లలమఱ్ఱి" అనుదానిని శారదాపీఠమని చెప్పుటచేతను నూహింపనై యున్నది. అందు సరస్వతీవర్ణన మెట్లన్నను :-

సీ. ప్రణవపీఠమున మంత్రపరంపరలు గొల్వ, నుండు నేదేవిపేరోలగంబు
   భావజ్ఞులకుఁ బరాపశ్యంతిమథ్యమా, వైఖరు లేదేవివర్ణ సరణి