పుట:Kavijeevithamulu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

కవి జీవితములు

4. చెన్న పట్టణములోని గవర్నమెంటువారి ప్రాచీనపుస్తక భాండాగారములో సి. పి. బ్రౌన్ (Mr. C. P. Brown) దొరవలన మేకంజై కలెక్షన్‌స్ (Mackenzic Collections of old Manuscripts) లలో నుండి యెత్తివ్రాయించఁబడిన లోకల్‌రికార్డు (Local Records) లను స్థలచారిత్రగ్రంథములలో మూఁడవసంపుటము 389 పుటలోఁ దిక్కనసోమయాజిమృతికాలమును స్పష్టపఱుచునొకపద్యము కానుపించును. అదెట్లన్నను :-

క. అంబరరవిశశిశాకా, బ్దంబులఁ జను కాళయుక్తిభాద్రపదపుమా
   సంబున రవిప్రభావిని, భంబగుశ్రీతిక్కయజ్వ బ్రహ్మముఁ జేరన్.

అనునీపద్యములోని "అంబర = 1, రవి = 12, శశి = 1 అనుదానిని "అంకానాం వామతో గతిః" అనుగణితశాస్త్రసూత్రముం బట్టి లెక్కింపఁగా 1120 తేలును. ఇది శాలివాహనశకము. సంవత్సరనామము కాళయుక్తి. ఇది తిక్కనసోమయాజిమృతివత్సరము. ఈపైసంఖ్యను 1210 గా లెక్కించి ఆంధ్రకవులచారిత్రములో వ్రాసినది గణితశాస్త్రసంప్రదాయమునకు సరి కాదు. అట్టివత్సరము కాళయుక్తివత్సరము కాదు. రెండం కెలఁ గూర్చి యొక్కటే సంకేతనామము చెప్పఁబడినప్పు డారెండం కెలకు "అంకానాం వామతో గతిః" అనుసూత్రము పట్టదు. వీనిం దెల్పుటకు మఱొయొక్క శాసనోదాహరణముం దెల్పెదను. అది రాజమహేంద్రవరములో మార్కండేయశివాలయమును మరలఁ గట్టించిన కాటయవేమా రెడ్డిభార్య మల్లాంబ కోనసీమలోనిమల్లవరాగ్రహార దానముం జేసినప్పు డిచ్చినశాసనము. దీనివివరణము రెడ్లచారిత్రములో వ్రాయఁబడినది. ఇపుడు ప్రస్తుతాంశమునకు వలయుశ్లోకమును మాత్రముదాహరించెదను. ఎట్లన్నను :-

"శ్లో. శ్రీశాకే గుణ రామ విశ్వ గణితే కార్తిక్యహేబ్జే ఖరే." అని

ఇం దుదాహరింపఁబడి శకవత్సరము గుణ=3, రామ=3, విశ్వ(13 విశ్వే దేవతలు)=13 - దీనిని లెక్కించునపుడు "అంకానాం" అను సూత్రమునకుఁ బ యర్థమే కాకున్న 3133 శాలివాహనశకము