పుట:Kavijeevithamulu.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
93
తిక్కనసోమయాజి.గాన్పించునేడ్గురురుద్రులలో నెవ్వరివలన నాగయగన్న మంత్రికాలము నేర్పఱుపవలయునో తెలియకున్నది. ఇది యయినపిమ్మట నతనికి మార్కండేయ పురాణముం గృతి యిచ్చినమారనకవికాలము నిర్ణయింపవలయును. ఇంతశ్రమకు నొప్పికొని మారనకవికాలము నిర్ణయించినచో నామారనకవి తిక్కనసోమయాజికొడుకు గాక తిక్కనసోమయాజిశిష్యుఁడగుతిక్కనమంత్రికుమారుం డైనట్లుగా నీవఱకే చూపించి యుంటిమి. మన మొక వేళ మారనకవికాలము నిర్ణయించినను మొదటియంశములోఁ జెప్పఁబడినయాక్షేపణలే యిందును దటస్థము లగునుగావున దీనింబట్టియును తిక్కనసోమయాజి కాలము నిర్ణయింప వీలుపడదాయెను. కావున నాంధ్రకవిచారిత్రములో వ్రాయఁబడినసిద్ధాంతము మాని తిక్కనసోమయాజికాల మిఁక నెట్లు నిర్ణయింపవలయు నని శంకించుకొనెదము. దాని కీక్రిందిభాగములోఁ జేయఁబోవునుపన్యాసము సమాధాన మై సిద్ధాంతమును సృష్టీకరించును.

సోమయాజికాలనిర్ణయము.

తిక్కనసోమయాజి యేకాలము వాఁడైనదియును నిర్ణయించుట కొకటిరెండు మార్గములు గలవు. అందు మొదటిది సోమయాజిప్రభుండగుమనుమసిద్ధిరాజు కాలపరిజ్ఞానము. రెండవది యీ రాజుయొక్కగాని, లేక, అతనిపూర్వు లగురాజులయొక్కగానిసమ కాలీనుల కాలవిజ్ఞానము. ఈరెండును గానిచోఁ దిక్కనసోమయాజి సమకాలీనుల కాలములఁ దెలిసికొనుట గాని లేక కేవలము లోకమువాడుకవలనఁ గల్గెడుకథాజ్ఞానము కల్గించుకొనుట గాని యయి యుండును. అందులకు ముందు మొదటిదానిలో నీసంశయమును నివారించుస్పష్టగాథలు లేవు. రెండవగాథలోనియంశములు చూచినం గాని దానిలోఁ గలసంశయములు తీఱవు. కావున రెండవదానిని వివరించెదను. ఎట్లన్నను :-

1. తిక్కనసోమయాజితోఁ గొంచెము సంబంధము గల్గియున్న వాసిష్ఠ రామాయణగ్రంథకర్త యగుసింగనకవి తనతాతభార్య తిక్కన