పుట:Kavijeevithamulu.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదివ్రాయఁబడినపద్యములు నుదాహరణములు గానైన నుండును. అవి యన్నియుఁ జేరి యొకగ్రంథముగా నేర్పడఁగా నందువలన నాంధ్రభాషకుఁ గల్గినలాభమేమయ్యె ననఁగా నదివఱలోఁ గవిజీవితములలో నేర్పఱుపఁ బడిన కాలనిర్ణయములు పూర్వపక్షము లగుటయుఁ గవిచరిత్రములోఁ జేయఁబడిన తద్విషయకోపన్యాసములనుబట్టి యట్టినిర్ధారణ చేయుటకు వీలులేకుండుటయుఁ దటస్థం బయ్యెను. పైమార్గమునే యవలంబించి నెల్లూరుజిల్లాలో మఱియొకబుద్ధిశాలియును గవిజీవితములలోని ప్రధమ భాగమును దనభాషాపాండిత్యమును జూపుచు మాఱిచి మఱికొన్ని యంశముల నిష్టానుసారముగాఁ జేర్చి యొకగ్రంథ మచ్చువేసి ప్రకటించెను. ఇది క్రీ. శ. 1886 సంవత్సరమువఱకై యుండెను. కాని నేను జేయుచున్న దేశచారిత్రము ముగియక యుండుటంబట్టియును గొందఱు నేనదివఱకు చేసిన సిద్ధాంతములఁ బూర్వపక్షము చేయుటంబట్టియును, మరల నాగ్రంథము ముద్రించి ప్రకటింప నవసర మున్నదియు లేనిదియుఁ జూడకుండ ధనవ్యయము చేయ నేల యని యూహించి నేను జేయుచున్నపనినే నెఱవేర్చుచు నుంటిని. అది క్రిందటిసంవత్సరముతో ముగిసినది కావున దానిని బ్రకటించువఱకుఁ జిరకాలము పట్టు నని యెంచి యిదివఱలోఁ దొలుతఁ బ్రకటింపఁబడిన కవిజీవితములను బ్రారంభములోఁ బ్రకటించినచోఁ బాఠశాలలకు మిగుల నుపయోగ మగు నని నా మిత్రులు ప్రేరేపఁగా నే నిపుడు దానిలో నీభాగములను బ్రచురించుచున్నాను. కవిచరిత్రముయొక్క రెండవభాగము ప్రచురింపబడుచున్నది గావున నిపుడు నేనుప్రచురించెడు గ్రంథములో సాధ్యమగునంత వఱకు దానిపైఁ బూర్వపక్షములఁగూడ బ్రకటించెదను. ఇట్టిపని పై గ్రంథకర్తల యెడలఁగాని వారిగ్రంథములయెడలఁగాని నాకొకయసూయ కల్గి యుండుటచేతఁ గాదు. ఎవరికిఁ దోఁచిన సిద్ధాంతమును వారు స్వతంత్రించిచూపిన నది పాఠకుల కుపయోగింపక మిక్కిలి సంతోషముతోఁ జదువుచున్న చారిత్రములు మతఖండనలు గలసంవాదగ్రంథములను భాష్యములు జదివినట్లు చదివి తుదకు ముఖసిధానమై పూర్వపక్షము చేసినవారికిని సిద్ధాంతము చేసినవారికిని నాల్గుదీవెన లిచ్చి పూజించి గ్రంథమును క్రింద నుంచివేయుదురు. అట్టిసన్మానము కలుగకుండఁగఁ బ్రస్తుతము నేను జేయుపూర్వపక్షసిద్ధాంతములు విమర్శన మనుశీర్షికతో