పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వృత్తాధికారము.

45

[1]పృథ్వీవృత్తము. -
        ప్రియంబగుచు రుద్రవిశ్రమము పృథ్వికాసంజ్ఞికా
        హ్వయం బగు జసంబుతో జసయనంబులున్ గూడినన్. 90

వ. ధృతిచ్ఛందబునకుఁ బదునెనిమిది యక్షరంబులు పాదంబుగా 262144 వృత్తంబులు పుట్టె. అందు,

కుసుమితలతా వేల్లితవృత్తము. -
        అశ్రాంతత్యాగాన్విత ! మతనయాయంబులన్ రుద్రసంఖ్యా
        విశ్రాంతం బైనన్ గుసుమితలతావేల్లితావృత్త మయ్యెన్. 91

మత్తకోకిలవృత్తము. -
        శ్రావకాభరణాంక ! విన్ రసజాభ రేఫల దిగ్విరా
        మావహంబుగ మిత్తకోకిల యండ్రు దీనిఁ గవీశ్వరుల్. 92

[2]అతివినయవృత్తము. -
        ననలుగలయఁగ సనలనసయుతము లగుచున్
        దనరు నతివినయ కివి దశమయతి కృతులన్. 93

[3]త్వరితపదగతివృత్తము. -
        సరిసిరుహభవసదృశ చతుర ! ననననాయల్
        త్వరితపదగతి కమరు దశమయతియుఁ గాఁగన్. 94

వ. అతిధృతిచ్ఛందంబునకుఁ బందొమ్మిదియక్షరంబులు పాదంబుగా 524288 వృత్తంబులు పుట్టె. అందు,

శార్దూలవిక్రీడితవృత్తము. -
         నారాచారవిశారదా ! యినయతిన్ శార్దూలవిక్రీడితా
         కారంబై మసజమ్ము లిమ్ముగ నతాగప్రాప్తమైచెల్వగున్. 95

  1. క-బ-లలో నున్నది.
  2. క-లో మాత్ర మున్నది.
  3. క-బ-లలో మాత్ర మున్నది.