పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

కవిజనాశ్రయము.

వ. అత్యష్టీఛందంబునకుఁ బదియే డక్షరంబులు పాదంబుగా 131072 వృత్తంబులు పుట్టె, అందు,

శిఖరిణీవృత్తము. –
          పురారాతిస్ఫర్థీ! యమనసభవంబుల్ పెనఁగి సుం
          దరంబైనన్ రేచా! శిఖరిణియగున్ ద్వాదశయతిన్. 84

[1]సుగంధివృత్తము .--
          భాసురంబుగా రజద్వయంబుపై రవంబు గూడఁగా
          నాసుగంధికిన్ దిశావిరామ మంచితం బగున్ ధరన్. 85

హరిణీవృత్తము. -
          నసమరసవప్రోక్తంబై రుద్రనవ్యవిరామ మిం
          పెసఁగ హరిణీవృత్తంబయ్యెన్ గవీంద్రజనాశ్రయా ! 86

[2]పాలాశదళవృత్తము. -
         కదియఁగ నననన నగగములకును బాలా
         శదళ మనఁ జనునది దశమయతియుఁ గాఁగన్. 87

మందాక్రాంతావృత్తము. -
         కాంతాకాంతా! మభనతతగా కాంతి సంక్రాంతి[3] మందా
         క్రాంతంబన్పే రమరు దశమాశ్రాంతవిశ్రాంత మైనన్. 88

నర్కుటవృత్తము. -
        నజభజజల్ వకారము పెసంగిన నర్కుటకం
        బజితగుణాన్వితా! యతి దిశాన్వితమై పరఁగున్ . 89

  1. బ-లో మాత్ర మున్నది.
  2. చ-లో మాత్ర మున్నది. దీని కిందే త్వరితపదగతి యనునామాంతరము గూడఁ గలదు.
  3. చ-డ-సంతాన.