Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వృత్తాధికారము.

39

[1]తోదక వృత్తము. -
                    జలరుహవక్త్ర! నజాయగణంబుల్
                    వెలయఁగఁ దోదకవృత్తముఁ జెప్పున్. 56

స్రగ్విణీవృత్తము. -
                    వాగ్వధూవల్లభా! వార్ధిరేపావళిన్
                    స్రగ్విణీవృత్త విశ్రామముల్ ధాత్రిపై. 57

జలధరమాలావృత్తము. -
                    మారాకారా! జలధరమాలావృత్తా
                    కారం బయ్యెన్ మభసమకల్పం బైనన్. 58
[2]ప్రియంవదావృత్తము. -
                    నయుతమై నెగడినం బ్రియంవదా
                    హ్వయ మగున్ భజరవర్గ మిమ్మహిన్. 59

ప్రమితాక్షరవృత్తము. -
                    అమరంగఁజేయు సజసావళితోఁ
                    బ్రమితాక్షరాఖ్యము నపారగుణా! 60

జలోద్ధతగతివృత్తము. -
                    జలోద్ధతగతిన్ జసంబుల జసం
                    బులొంది యెఱిఁగింపు భూజననుతా![3] 61

  1. క-ద-ల-లో రోదక.
  2. ద-ప్రియంవరా.
  3. క-భోజవినుతా.