Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

కవిజనాశ్రయము.

వ. పఙ్త్కిచ్ఛందంబునకుఁ బది యక్షరంబులు పాదంబుగా 1024 వృత్తంబులు పుట్టె. అందు,

రుగ్మవతీవృత్తము. -
                       వాగ్మి ! భమప్రవ్యక్తి సగంబుల్
                       రుగ్మవతీ సద్రూపక మయ్యెన్. 36

మత్తావృత్తము. -
                      మత్తావృత్తం బగు మభసంబు
                      ద్యత్తేజస్వీ ! గయుతము గాఁగన్. 37

మయూరసారివృత్తము. -
                      పన్ను గా రజంబుపై రగంబుల్
                      సన్ను తా ! మయూరసారిఁ జెప్పున్. 38

[1]శుద్ధవరాటీవృత్తము. -
                      [2]సంబుద్ధిన్ మసజంబుతో, గకా
                      రంబై శుద్ధవరాటి నాఁ జనున్. 39

పణవవృత్తము. -
                      యత్నంబై మనయగముల్ వాక్ఛ్రీ
                      పత్నీవల్లభ ! పణవం బయ్యెన్. 40

వ. త్రిష్టుప్ఛందంబునకుఁ బదునొకం డక్షరములు పాదంబుగా 2048 వృత్తంబులు పుట్టె అందు,

శాలినీవృత్తము. -
                     [3]వంద్య శ్రీసంసేవ్యవక్షా! మతాగా
                     నింద్యంబైనన్ శాలినీనామ మయ్యెన్. 41

  1. ద-శుద్ధవిరాటి.
  2. ద-సంబుద్ధీ.
  3. ద-పద్యశ్రీసంసేవితా భామతాగా, వేద్యం బైనన్ శాలినీవృత్త మయ్యెన్.