Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

కవిజనాశ్రయము.

ప్రగుణవృత్తము. -
                      సగణం బొందన్
                      గగముం జెందన్
                      బ్రగుణం బ న్పే
                      రగు నీధాత్రిన్ - 14

అంబుజవృత్తము.-
                      ఇంబుల భకా
                      రంబును లగం[1]
                      బుం బొనరఁగా
                      నంబుజ మగున్.[2] 15

వ. గాయత్రీఛందంబునకు నాఱక్షరంబులు పాదంబుగా నఱువది నాలుగువృత్తంబులు పుట్టె. అందు,

విచిత్రవృత్తము.— యయంబుల్ విచిత్రా
                       హ్వయం బయ్యె ధాత్రిన్ - 16

తనుమధ్యావృత్తము -
                       [3]చంచ త్తయము ల్ప్రా
                       పించున్ దనుమధ్యన్. 17

  1. ద-బుం బొరయఁగా.
  2. ఈపద్యము తరువాత క-డ-ద-లలోఁ ఇది వాదీంద్ర .. . విరచితం బైన కవిజనాశ్రయం బనుఛందంబునందు యతిచ్ఛందో౽ధికారము , అనుగద్యమును దరువాత , క. ఛందోదేనత బుధజన , వందిత గాయత్రి మధురవచనామృతని, ష్యందంబు మన్ముఖేందువు, నందొందించు నది గాత మానందముగాన్ . అను పద్యము నున్నవి.
  3. ప-లో లేదు. ద-లో-ఎంచం దయము ల్ప్రా.