Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వృత్తాధికారము.

29

వ. [1]అవి యెవ్వి యనిన.—ఉక్త, అత్యుక్త, [2]మధ్య, ప్రతిష్ఠ, సుప్రతిష్ఠ, గాయత్రి, [3]ఉష్ణిక్ , అనుష్టుప్ , బృహతి, పఙ్త్కి , త్రిష్టుప్ , జగతి, అతిజగతి, శక్వరి, అతిశక్వరి, అష్టి, అత్యష్టి, ధృతి, అతిధృతి, కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, [4]సంకృతి, అభికృతి, [5]ఉత్కృతి, యన నిట్లు సమవృత్తంబులను నుత్తమరత్నంబులు పుట్ట నాకరం బైనసాగరవేలయుం బోలె నొప్పుచున్న యీయిరువదాఱు ఛందంబుల వేఱువేఱ వివరించెద. 3

క. [6]వృత్తములకుఁ దగు పేళ్లును
   వృత్తగణాక్షరము లెడల విశ్రమములు నా[7]
   వృత్తార్థముననె చెప్పుదు
   వృత్తసమూహంబు కృతుల వెలయుచు నుండన్. 4

వ. [8]ఉక్తాఛందంబునకు నొక్కక్షరంబు పాదంబుగా రెండువృత్తంబులు పుట్టె అందు,

శ్రీయనువృత్తము.—శ్రీ
                          శ్రీన్
                          జే
                         యున్. 5


  1. డ-అ దెట్లనిన?
  2. డ-ద- మధ్యమ.
  3. ఉష్ణిహ.
  4. ప-సంకృతి.
  5. ప-ద-వ్యుత్కృతి.
  6. ఈపద్యము-క-డ-ద- స్థానాంతరముల నున్నది.
  7. స-విశ్రామములున్ , వృత్తార్థములం జెప్పుదు.
  8. ద-లో లేదు.