శ్రీరస్తు.
కవిజనాశ్రయము
[1]వృత్తాధికారము.
- సమవృత్తములు -
క. [2]పరమాత్మముఖారుణసర సిరుహవినిర్గతసమస్తసిద్ధాక్షరపం క్తి రసావహమృదుపదసుం దరతరకృతిరచన లీవుతను దయ మాకున్ . 1 క. [3]సమవృత్తములఁ జతుష్పా దములం దొక్కక్షరము మొదలుగా నెక్కున్ గ్రమమున గణాక్షరంబులు సమాన మై యిరువదాఱు ఛందములందున్. 2