Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంజ్ఞాధికారము

21


- బిందుయతి. -

క. [1]కచటతప లనఁగఁ బరఁగిన
   ప్రచురం బగు నేనువర్గపంక్తుల పిఱుఁదన్
   రుచిరము గ బిందు వూఁదిన
   నచలం బై వళ్లు చెల్లు నంత్యాక్షరముల్. 68

గీ. జౌకు వడి చెల్లు రత్నకంకణ మనంగ
    ఞాకు వడి చెల్లు బర్హి పింఛం బనంగ
    ణాకు వడి చెల్లుఁ గనకమండప మనంగ
    నాకు వడి చెల్లు దివ్యగంధం బనంగ
    మాకు వడి చెల్లు విజతశంబరుఁ[2] డనంగ. 69

- ప్లుతయతి. -



క. [3]దూరాహ్వానమునందు మ
   హారోదనగానసంశయార్థములతుదన్[4]
   [5]జేరువఁ దగ నాద్యచ్చుల
   [6]నారూఢిగఁ బ్లుతమువడి మహత్త్వము మీఱున్. 70

  1. బ - దీనికి బదులుగా, క. పంచకవర్గాక్షరములు, పంచమవర్ణములఁ గూడి పరఁగఁగ నిలుచున్ , వంచింపఁగఁ బెఱనాలుగు, సంచితముగఁ బిఱుఁద సున్నలంటిన చోటన్.
  2. ప - దివిజవంశం బనంగ.
  3. ద - లో నీ పద్యమునకు ముందు , క . ప్లుత మనఁబరఁగుఁ ద్రిమాత్రా, న్వితవర్ణము దానిమీఁద వితతస్వరముల్ , కృతిపై యక్షరమునఁ జనుఁ, జతురాననచతుర (యతులు) వళ్లు చక్కటిఁ జెల్లున్. అను పద్య మున్నది.
  4. ద - ములు తుదిన్.
  5. ద - జేరువతో
  6. ద - తో రూఢిన్ బ్లుతమువడి యెదుర్కొని నిలుచున్ ప - లో నీ పద్యమునకు లక్ష్యముగా 'ఏజనకాత్మజన్' అను భాస్కరరామయణపద్య ముదాహరింపఁబడినది.