ఈ పుట అచ్చుదిద్దబడ్డది
20
కవిజనాశ్రయము
- వర్గయతులు. -
క. [1]నిక్కువ మయ్యెన్ వర్గపు
టక్కరముల వళ్లు నిలుప నగు జఞణనమల్ !
తక్కఁ బెఱనాలుగింటికి[2]
దిక్కరిసన్ని భుఁడ రేచ ధీజనవినుతా! 65
- అఖండయతి. -
ఉ. [3]మానుగ విశ్రమాక్షరసమన్వి[4]త మై స్వరమూఁదినన్ దదీ
యానుగుణాక్షరంబెకొనియైనను జెప్పఁగనొప్పు[5] నీక్రియన్
భానుసహస్రభాసి వృషభాధిపుఁ డన్నటు లర్థయుక్తమై
[6]పూనినచో నఖండయతి పొ ల్పగునాదికవి[7] ప్రసిద్ధమై. 66
- ప్రాదియతులు. -
క. ప్రపరాపసమనుసుప్ర
త్యపినిర్దురధిన్యుపాభ్యుదాఙ్న్యత్యవప
ర్యుపసర్గవింశతికి[8] వ
ళ్లుపరిస్వరయుక్త మైన నుభయము చెల్లున్ .[9] 67