పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంజ్ఞాధికారము

19


- యతిభేదములు. -

క. [1]స్వరవర్గాఖండప్రా
   చ్యురుబిందుప్లుతములున్ బ్రయుక్తాక్షరముల్
   [2]పరఁగఁగ నెక్కటి పోలిక
   [3]సరసలు నాఁ బదివిధములఁ జను వళ్లు మహిన్. 62

- స్వరయతులు. -



క. [4]అఆ లైఔలకు మఱి
   ఇఈలు ఋకారసహిత మెఏలకు నౌ
   [5]ఉఊ ల్తమలో నొడఁబడి
   ఒఓలకు వ ళ్లగు న్న యోన్నతచరితా! 63

క. [6]స్వరగణము కకారాద్య
   క్షరములతో సంధి చేసి కదియించినఁ ద
   త్స్వరము కొని చెప్పునది వ
   ళ్లరవిందజసదృశ కవిజనాశ్రయ కృతులన్. 64


  1. క - ప - ద - లలో నున్నది.
  2. బరువడి.
  3. ప - సరసమనన్ బ - సరసలు నాఁ బదియు వళ్లు చను నిద్ధాత్రిన్ . వ. స్వరయతి, వర్గయతి, అఖండయతి, ప్రాది బిందు ఫ్లుతములు, ప్రయుక్తాక్షరయతి, ఎక్కటి, పోలిక , సరసయతి, ఈపదియును యతుల పేళ్లు.
  4. క - ప - డ - ద-లలో నున్నది - ఈపద్యంబున - అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఒ ఓ -అనుచోట్ల ద్వితీయాక్షరములు ద్విత్వాక్షరములవలె నుచ్చరింపఁబడును గావున వానిముం దున్న హ్రస్వాక్షరములు గురువులుగాఁ బ్రయోగింపఁబడిన వని యూహించునది. మఱియు నిందుఁ
    గేవలస్వరములకుఁ బ్రాసము విధించుట విశేషము .
  5. ద - నుఊలొడఁబడి తమలో.
  6. క - డ - ద - లలో నున్నది.